హైదరాబాద్‌లో షోరూమ్‌ను ప్రారంభించనున్న డిసి డిజైన్స్

అంతేకాకుండా.. తమిళనాడు రాజధాని చెన్నైలో కూడా ఓ షోరూమ్‌ను ఏర్పాటు చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది. ప్రస్తుతం ఈ షోరూమ్‌లో, డిసి డిజైన్స్ ఇటీవల 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించిన మేడ్ ఇన్ ఇండియా స్పోర్ట్స్ కారు అవంతిను ప్రదర్శనకు ఉంచారు. 2013-14 నాటికి 300 యూనిట్ల అవంతి కార్లను తయారు చేసి, విక్రయించాలని భావిస్తున్నామని ఆయన చెప్పారు.
తమ వినియోగదారుల కోసం త్వరలోనే డిసి డిజైన్ కార్ సర్వీసింగ్ సెంటర్లను అందుబాటులోకి తీసుకువస్తామని, టొయోటా ఇన్నోవా, ఫార్చ్యూనర్, హోండా సిటీ, హ్యుందాయ్ ఐ20, మారుతి సుజుకి స్విఫ్ట్, మహీంద్రా థార్, టెంపో ట్రావెలర్స్ వంటి వాహనాలకు ఇంటీరియర్, ఎక్స్టీరియర్‌లను వినియోగదారుల అభిరుచికి తగినట్లుగా మార్పులు చేసిస్తామని కంపెనీ వెల్లడించింది.


Click it and Unblock the Notifications








