భారత సైన్యం కోసం సాలిడ్ సఫారీని ఆవిష్కరించిన టాటా మోటార్స్
ప్రస్తుతం న్యూఢిల్లీలో జరుగుతున్న రక్షణ రంగ ఉత్పత్తుల ప్రదర్శన 'డిఫెక్స్‌పో-2012'లో వివిధ ఆటోమొబైల్ కంపెనీలు భారత సైన్యం కోసం రూపొందించిన వాహనాలను ప్రదర్శనకు ఉంచాయి. ఇందులో టాటా మోటార్స్ కూడా పలు ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచుంది. అందులో సఫారీ స్టోర్మ్ జిఎస్ 800 4x4 ఎస్‌యూవీ కూడా ఒకటి. ఈ సఫారీ చూడటానికి త్వరలో ప్యాసింజర్ మార్కెట్లోకి రానున్న సఫారీ స్టోర్మ్ మాదిరిగానే ఉంటుంది.
అయితే, పూర్తి బుల్లెట్ ప్రూఫ్ బాడీతో తయారైన ఈ సఫారీ స్టోర్మ్ జిఎస్ 800ను ఆయుధాలతో నింపబడి ఉంటుంది. బాంబు దాడులను సైతం ఇది ఎదుర్కుంటుంది. ఇండియన్ ఆర్మీ అవసరాల మేరకు ఈ సఫారీ స్టోర్మ్ జిఎస్ 800ను టాటా మోటార్స్ డిజైన్ చేసింది. హై ప్రొఫైల్ కలిగిన వ్యక్తులకు సైతం ఈ బుల్లెట్ ప్రూఫ్ సఫారీని విక్రయించాలని టాటా మోటార్స్ భావిస్తోంది. ఇకపోతే సాధారణ ప్యాసింజర్ వెర్షన్ సఫారీ స్టోర్మ్‌ను టాటా మోటార్స్ త్వరలోనే మార్కెట్లోకి తీసుకురానుంది.


Click it and Unblock the Notifications









