సెకండ్ హ్యాండ్ కార్లకు పెరుగుతున్న డిమాండ్

దిగిరాని వడ్డీ ధరలు, పెరుగుతున్న ఇంధన రేట్ల కారణంగా కొత్త కార్ల అమ్మకాలు మందకొడిగా సాగుతున్నప్పటికీ, సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. మార్కెట్ నిపుణల అంచనా ప్రకారం, కొత్త కార్ల మార్కెట్ పరిమాణం ఎంత ఉంటుందో ఇంచు మించు అదే పరిమాణంలో సెకండ్ హ్యాండ్ కార్ (యూజ్డ్ కార్స్) మార్కెట్ కూడా ఉంటుంది.

ప్రస్తుత సంవత్సరంలో సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్ సుమారు 10-11 శాతం మేర వృద్ధి చెందవచ్చని మార్కెట్ పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో కొత్త కార్ మార్కెట్ కేవలం 3-4 శాతం మేర మాత్రమే వృద్ధిని సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రన్నింగ్ కాస్ట్, అధిక పెట్రోల్ ధరలు, బ్యాంక్ వడ్డీ రేట్లను పరిగణలోకి తీసుకొని కస్టమర్లు సెకండ్ హ్యాండ్ వాహనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.

సెకండ్ హ్యాండ్ కార్లలో మార్కెట్ రీసేల్ వ్యాల్యూ అధికంగా ఉన్న మోడళ్లనే ఎక్కువగా ఎంచుకోవటం జరుగుతోంది. సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్లో హ్యుందాయ్ ఐ10, శాంత్రో, హోండా సిటీ, మారుతి సుజుకి ఆల్టో వంటి మోడళ్లకు మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం లగ్జరీ కార్ కంపెనీలతో మొదలుకొని సాధారణ ప్యాసింజర్ కార్ కంపెనీల వరకూ సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నాయి.

ఈ సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారం ద్వారా తమ కొత్త కార్ల వ్యాపారాన్ని పెంచుకునేందుకు ఆటోమొబైల్ కంపెనీలు ఈ వ్యాపారంలోకి ప్రవేశిస్తున్నాయి. ఎక్సేంజ్ ఆఫర్ స్కీమ్‌తో కస్టమర్ల నుంచి పాత కార్లను కొనుగోలు చేసి, వాటిని రీకండిషన్ చేసి తిరిగి సెకండ్ హ్యాండ్ కార్ డీలర్‌షిప్‌ల ద్వారా విక్రయించడం జరుగుతోంది. ప్రస్తుతం పెరిగిన పెట్రోల్ ధరల కారణంగా సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్లో కూడా డీజిల్ కార్లకే అధిక డిమాండ్ ఉంటోంది.

More from DriveSpark

Article Published On: Thursday, July 12, 2012, 11:12 [IST]
English summary
Second hand car market is going at rapid speed despite of market slowdown. As per the market analysts India's used car market, roughly the same size as the new car market and it will grow 10-11% this year compared to the 3-4% growth expected in the new car market.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+