ఆటో విడిభాగాల పరిశ్రమ కోసం రూ.1,000 కోట్లు ఇవ్వండి!
ఆటో విడిభాగాల పరిశ్రమకు మంచి రోజులు వచ్చే సూచనలు కనబడుతున్నాయి. ఈ విభాగాన్ని ప్రపంచ వ్యాప్తంగా పోటీ ఇచ్చేటట్లు తీర్చేందుకు గానూ, రానున్న బడ్జెట్‌లో ఆటో విడిభాగాల పరిశ్రమ యొక్క టెక్నాలజీ అప్‌గ్రడేషన్ కోసం రూ.1,000 కోట్ల నిధులను కేటాయించాల్సిందిగా భారీ పరిశ్రమల విభాగం (డిహెచ్ఐ) ప్రభుత్వాన్ని కోరింది.
రూ.1,000 కోట్ల సాంకేతిక నిధులను సృష్టించాల్సిందిగా తాము కోరామని, ఇదొక ఆవృత్త నిధి అని, ప్రజలు దీనిని తీసుకోవచ్చు, తిరిగి చెల్లించవచ్చు, పునరుద్ధించవచ్చని డిహెచ్ఐ అధికారి ఒకరు తెలిపారు. ఇందులో కొత్త అభ్యర్థులు కూడా పాల్గొనవచ్చని ఆయన తెలిపారు.
ముందస్తు బడ్జెట్ రికమెండేషన్‌లో భాగంగా టెక్నాలజీ అప్‌గ్రెడేషన్ స్కీమ్ కింద రూ.1,000 కోట్ల నిధులను కేటాయించాల్సిందిగా డిహెచ్ఐ ప్రభుత్వానికి సూచించింది. ఈ స్కీమ్‌లో ఆటో విడిభాగాల కంపెనీలు టెక్నాలజీ అప్‌గ్రెడేషన్ కోసం ప్రభుత్వం నుండి పొందే రుణాలపై 5 శాతం సబ్సిడిని పొందవచ్చు. ఈ స్కీమ్ క్రింద ప్రస్తుతం టెక్స్‌టైల్ సెక్టార్ మాత్రమే లభ్ది పొందుతోంది.


Click it and Unblock the Notifications









