బడ్జెట్ 2012లో డీజిల్ కార్లపై 10 శాతం అదనపు సుంఖం!

Diesel Car
డీజిల్ కార్లను కొనాలనుకుంటున్నారా..? అయితే మీకు ఇదే అదునైన సమయం. ఒకవేళ మీరు వచ్చే మార్చి నెల తర్వాత డీజిల్ కార్లను కొనాలనుకుంటే మీ చేతి చమురు వదిలించుకోక తప్పదు. ఎందుకంటే, డీజిల్ కార్ల ధరలకు త్వరలోనే రెక్కలు రానున్నాయి.

ప్రస్తుతం కొనుగోలుదారులు అధికంగా డీజిల్ కార్లను కొనుగోలు చేస్తుండటం, పెరుగుతున్న డీజిల్ కార్ల డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునేందుకు మరోవైపు ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు డీజిల్ ప్లాంట్లపై తమ పెట్టుబడులను విస్తృతం చేస్తున్న తరుణంలో డీజిల్ కార్ల ధరలపై అధనపు సుంఖాన్ని విధించాలని కంపెనీ యోచిస్తోంది.

ఈ నేపథ్యంలో రానున్న బడ్జెట్‌లో డీజిల్ ప్యాసింజర్ కార్లపై 10 శాతం అదనపు సంఖాన్న వసూలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చేసిన సిఫారసుల మేరకు కేంద్ర ప్రభుత్వం, దీనికి సంబంధిం ఓ ప్రతిపాదనను కూడా చేసింది. అంతేకాకుండా.. డీజిల్‌ను అధికంగా తాగే ఎస్‌యూవీలపై మరింత అదనపు సుంఖాన్ని వసూలు చేయాలని కేంద్ర సర్కారు యోచిస్తోంది.

అసలే అమ్మకాలు తగ్గుముఖం పట్టి కార్ల కంపెనీలు లబోదిబోమంటుంటే.. తాజాగా డీజిల్ కార్లపై కేంద్ర ప్రభుత్వం విధించనున్న అదనపు సుంఖం అమ్మకాలను మరింత తగ్గించే ఆస్కారం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో డీజిల్ కార్ల వినియోగం గణనీయంగా పెరిగిపోవడంతో డీజిల్ వినియోగం కూడా అదే రీతిలో పెరిగిపోవడం జరుతుంది.

గడచిన బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం డీజిల్ కార్ల జోలికి రాలేదు, అంతేకాకుండా.. ప్రస్తుతం డీజిల్ ఇంధన ధరల నియంత్రణ కూడా ప్రభుత్వం అధీనంలోనే ఉంది. అయితే, పలు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కారణంగా ప్రభుత్వం ఇప్పట్లో డీజిల్ ధరలను పెంచడం కానీ, ధరల నియంత్రణను ఎత్తివేయడం కానీ చేయలేదు.

ఈ నేపథ్యంలో డీజిల్ వినియోగాన్ని తగ్గించేందుకు, డీజిల్ కార్లపై అదనపు సుంఖాన్ని వసూలు చేయడమే మంచి మార్గమని కేంద్ర సర్కారు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కార్ల తయారీకి వినియోగించే ముడిసరుకుల ధరలు చక్కలనంటుతున్నాయి. ఈసారి బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యలపైనే కార్ల ధరలు పెంపు కూడా ఆధారపడి ఉంది.

More from DriveSpark

Article Published On: Saturday, January 14, 2012, 17:49 [IST]
English summary
Diesel car prices will go up from march as the central government is planning to impose 10% additional tax on Diesel run cars. The proposal has already under the consideration of the central government. The Government may announce an official statement in this regard in upcoming budget.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+