ఇప్పట్లో డీజిల్ ధరలను పెంచే యోచన లేదు: జైపాల్ రెడ్డి

డీజిల్ ధరలపై ముసుగులో గుద్దులాట కొనసాగుతూనే ఉంది. డీజిల్ ధరలను పెంచాలా లేక డీజిల్ కార్లపై ఎక్సైజ్ సుంఖాన్ని పెంచాలా అనే సంశయంలో ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర చమురు శాఖ మంత్రి ఎస్.జైపాల్ రెడ్డి మాట్లాడుతూ.. డీజిల్ ధరలపై ఇప్పట్లో ప్రభుత్వ నియంత్రణలను ఎత్తివేసే ప్రసక్తే లేదని అన్నారు.

మరోవైపు డీజిల్ ధరలపై కేంద్ర భారీ పరిశ్రమల శాఖ స్పందిస్తూ.. డీజిల్ కార్లపై ఎక్సైజ్ సుంఖాన్ని పెంచడానికి బదులుగా డీజిల్ ధరలను పెంచాల్సిందిగా ప్రభుత్వానికి సూచనలు చేసింది. ఇలా ఒకే సర్కారులోని వివిధ మంత్రిత్వ శాఖలు, డీజిల్ ధరలపై విభిన్న వైఖరులు తెలియజేడం ఆందోళన కలిగించే విషయమే.

ఇదిలా ఉండగా, ఉత్తర ప్రదేశ్ ఎన్నికల కారణంగా గడిచిన నెలలుగా ప్రభుత్వరంగ చమురు కంపెనీలు పెట్రోల్ ధరలను పెంచకుండా ఉంచిన సంగతి తెలిసిందే. దీనివలన ప్రభుత్వరంగ చమురు కంపెనీలకు వాటిళ్లుతున్న నష్టాలకు ప్రభుత్వమే నష్ట పరిహారం చెల్లించాలని ఎస్.జైపాల్ రెడ్డి డిమాండ్ చేశారు.

డీజిల్ ధరలకు స్వేచ్ఛ కల్పించడం చాలా క్లిష్టమైన అంశమని, అయితే తగిన సమయంలో డీజిల్‌పై సబ్సిడీని తగ్గిస్తామని, కానీ ఆ సమయం ఇంకా రాలేదని మంగళవారం జరిగిన విలేఖరుల సమావేశంలో తెలిపారు. ప్రస్తుతానికి డీజిల్ రేట్లను పెంచే ప్రతిపాదన ఏదీ లేదని అన్నారు.

సబ్సిడి ధరలకే పెట్రోల్‌ను విక్రయిస్తయిన్న కారణంగా, చమురు కంపెనీలకు ఏర్పడుతున్న నష్టాలను ప్రభుత్వం భర్తీ చేయాలన్న ఆయిల్ కంపెనీల డిమాండ్‌కు జైపాల్ రెడ్డి మద్దతు పలికారు. ఈ విషయాన్ని తాము కేంద్ర ఆర్థిక శాఖ దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు.

More from DriveSpark

Article Published On: Wednesday, February 15, 2012, 11:53 [IST]
English summary
Even as discussions over decontrolling diesel prices continue, union Petroleum minister Jaipal Reddy has clarified that the government was not planning any measures to decontrol diesel prices or even impose additional taxes on the fuel.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+