సెప్టెంబర్ నెలలోనూ తగ్గిన కార్లు, బైక్‌ల అమ్మకాలు

By Ravi

Car Sales Down
కార్ కంపెనీలకు ఈ పండుగ సీజన్ ఆశించిన ఫలితాలను ఇచ్చేలా కనిపించడం లేదు. పెరుగుతున్న ఇంధన ధరలు, దోబూచులాడుతున్న రూపాయి మారకపు విలువలు ఇటు కొనుగోలుదాలుదారులను అటు కార్ల తయారీదారులను బెంబేలెత్తిస్తున్నాయి. గడచిన కొద్ది నెలలుగా కూడా ఆటోమొబైల్ అమ్మకాలు మందకొడిగా సాగుతూ, ప్రతికూల ఫలితాలను కనబరుస్తున్నాయి.

వరుసగా గడచిన సెప్టెంబర్ నెలలో కూడా కార్ల అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. అధిక వడ్డీ రేట్లు, పెరుగుతున్న ఇంధన ధరలు, తగ్గుతున్న ఆర్థిక వృద్ధులే ఇందుకు ప్రధాన కారణమని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) వెల్లడించిన గణాంకాల ప్రకారం, సెప్టెంబర్ 2012 నెలలో కార్ల అమ్మకాలు 5.4 శాతం క్షీణించి 1,57,536 యూనిట్లుగా నమోదయ్యాయి.

ఇదే సమయంలో మోటార్‌సైకిళ్ల కూడా 18.9 శాతం క్షీణించి 7,53,693 యూనిట్లుగా నమోదు కాగా, ట్రక్కులు, బస్సులు వంటి వాణిజ్య వాహనాల అమ్మకాలు మాత్రం స్వల్పంగా వృద్ధి చెంది 70,683 యూనిట్లుగా నమోదైనట్లు సియామ్ పేర్కొంది. మొత్తంగా చూసుకుంటే, సెప్టెంబర్ 2011తో పోల్చుకుంటే సెప్టెంబర్ 2012 నెలలో మొత్తం వాహన అమ్మకాలు 9.43 శాతం తగ్గి 15.6 లక్షల యూనిట్ల నుంచి 14.2 లక్షల యూనిట్లకు పడిపోయాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, October 10, 2012, 16:52 [IST]
English summary
Car sales fell in September for the second consecutive month, an industry body said on Wednesday, as high interest rates, rising fuel costs and slowing economic growth continued to drag down demand. Automakers sold 157,536 cars in September, down 5.4 percent from a year earlier, according to data released by the Society of Indian Automobile Manufacturers.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+