డీజిల్ కార్లపై ఎక్సైజ్ డ్యూటీ పెంచకండి; డీజిల్ ధరను పెంచండి

Excise Duty
రానున్న బడ్జెట్‌లో డీజిల్ కార్లపై అదనపు సుంకాలను వసూలు చేయాలనే ప్రతిపాదనకు కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ విముఖత వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే పారిశ్రామిక వృద్ధి రేటు అంతంత మాత్రంగా సాగుతున్న సంగతి తెలిసిందే. నేపథ్యంలో డీజిల్ కార్లపై అదనపు సుంకాలను విధించినట్లయితే, ఈ వృద్ధి మరింత దిగజారిపోయే ఆస్కారం ఉందని ఈ శాఖ భావిస్తోంది.

డీజిల్ కార్లపై అదనపు సుంకాలను విధించడానికి బదులుగా డీజిల్ ధరలను పెంచితే సరిపోతుందని ఈ శాఖ ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు ప్రణాళికా సంఘం (ప్లానింగ్ కమిషన్)తో సమావేశమైన కేంద్ర భారీ పరిశ్రమల శాఖ, డీజిల్ కార్లపై అదనంగా సుంకాన్ని వసూలు చేయడానికి బదులుగా, డీజిల్ ధరను ప్రతి లీటరుపై 75 పైసల చొప్పున పెంచినట్లయితే సరిపోతుందని సూచనలు చేసింది.

అయితే, కేంద్ర సర్కారు ఈ సూచనలను కనీసం పరిగణలోకి కూడా తీసుకునే అవకాశాలు కనబడటం లేదు. గడచిన బడ్జెట్‌లో కూడా ప్రభుత్వం డీజిల్ కార్ల జోలికి వెళ్లలేదు. సబ్సిడిలో విక్రయిస్తున్న డీజిల్ కారణంగా ఒవైపు ఇప్పటికే చమురు కంపెనీలు నష్టపోతుండగా, మరోవైపు డీజిల్ ధరలను పెంచితే అది నేరుగా పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపే ఆస్కారం ఉంది.

డీజిల్ ధరలను పెంచడం వలన కేవలం ప్యాసింజర్ కార్ల అమ్మకాలపై మాత్రమే ప్రభావం చూపకుండా, వాణిజ్య మార్కెట్‌పై అలాగే వ్యవసాయ రంగంపై కూడా ప్రభావాన్ని చూపుతుంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, డీజిల్ కార్లపై అదనపు సుంకాలను వసూలు చేయడమే ఉత్తమమని సర్కారు యోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ, ఇప్పుడిప్పుడు పుంజుకుంటున్న డీజిల్ కార్ మార్కెట్ వృద్ధి రేటు ప్రభుత్వం తీసుకునే నిర్ణయం పైనే ఆధారపడి ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, February 14, 2012, 15:17 [IST]
English summary
The Heavy Industries Ministry has been opposing the proposed additional duty on the diesel cars. After consulting with the Planning Commission, the Ministry has suggested an increase in diesel prices by Rs 0.75 per litre as an alternative to raising excise duty on diesel cars.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+