నెలకు రూ.15,999 ఉంటే చాలు.. బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 మీ సొంతం
బిఎమ్‌డబ్ల్యూ బ్రాండ్ కార్లంటే.. అమ్మో అంత ఖరీదైన కార్లు కొనడం మన వల్ల అవుతుందా అని వాటిని దూరం నుండి చూసి మురిసిపోవడంతో సరిపెట్టుకుంటాం. ఇది ఒకప్పటి మాట. నిజమే బిఎమ్‌డబ్ల్యూ కార్లు చాలా ఖరీదుతో కూడుకున్నవి. అయితే, ప్రస్తుతం లగ్జరీ/ప్రీమియం కార్ మార్కెట్ పరిమాణం పెరుగుతుండటం, దేశీయ మార్కెట్లో వివిధ ఫారిన్ బ్రాండ్‌లు తక్కువ ధరలకే తమ కార్లను విడుదల చేస్తుడంతో ఈ సెగ్మెంట్లో పోటీ పెరిగింది.
పెరిగిన పోటీని తట్టుకునేందుకు, బిఎమ్‌డబ్ల్యూ భారత మార్కెట్లో అందిస్తున్న చీపెస్ట్ ఎస్‌యూవీ 'ఎక్స్1' (ప్రారంభ ధర రూ.22 లక్షలు, ఎక్స్-షోరూమ్) కోసం ఓ సరికొత్త ఫైనాన్స్ స్కీమ్‌ను ఆఫర్ చేస్తోంది. బిఎమ్‌డబ్ల్యూకు చెందిన ఆర్థిక విభాగం "బిఎమ్‌డబ్ల్యూ ఫైనాన్షిల్ సర్వీసెస్" ఎక్స్1 ఎస్‌యూవీ సులభ వాయిదా పద్ధతి (ఈఎమ్ఐ) ఆఫర్‌ను అందిస్తోంది.
ఈ ఆఫర్‌లో భాగంగా, ప్రతి నెల కేవలం రూ.15,999 చెల్లించి బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 ఎస్‌యూవీని సొంతం చేసుకోవచ్చు. ఈ స్కీమ్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను మీ సమీపంలోని బిఎమ్‌డబ్ల్యూ డీలర్ నుండి పొందవచ్చు. ఈ ఆఫర్ మార్చి 31, 2012 వరకూ చెల్లుబాటులో ఉంటుంది.


Click it and Unblock the Notifications









