సోలార్ కారు 'సోలారిస్'ను అభివృద్ధి చేసిన డిటియూ

పెట్రోల్‌పై పైసా ఖర్చు పెట్టకుండా కారులో జామ్ జామ్ అంటూ వెళ్లిపోతుంటే ఎలా ఉంటుంది..? ఇప్పటికే సౌరశక్తితో నడిచే వివిధ వాహనాలను మనం చూశాం. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ లేటస్ట్ సోలార్ కారు పేరు 'సోలారిస్'. గంటకు గరిష్టంగా 120 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీసే ఈ ఎకో-ఫ్రెండ్లీ సోలార్ కారును ఢిల్లీ టెక్నోలాజికల్ యూనివర్సిటీ (డిటియూ) అభివృద్ధి చేసింది.

భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మంగళవారం ఢిల్లీలో ఈ సోలారిస్ సోలార్ కారును జెండా ఊపి లాంఛనంగా ఢిల్లీ ప్రారంభించారు. చూడటానికి సెడాన్ మాదిరిగా ఉండే ఈ సోలార్ కార్ పూర్తిగా పర్యావరణ సాన్నిహిత్యమైనది. తేలికపాటి బాడీ నిర్మాణం, లైట్ వెయిట్ అల్లాయ్ వీల్స్, పల్చటి రేడియల్ టైర్స్ వంటి విశిష్టతలు కలిగిన ఈ కారులో మొత్తం ఐదు మంది ప్రయాణికులు కూర్చోవచ్చు.

సెప్టెంబర్ 15 నుంచి 25 వరకూ దక్షిణాఫ్రికాలో జరగనున్న ససోల్ సోలార్ ఛాలెంజ్‌లో సోలారిస్ కారు పాల్గొనబోతుంది. ఈ ఛాలెంజ్‌లో ప్రపంచ వ్యాప్తంగా వివిధ సోలార్ కార్లు పాల్గొంటాయి. ఈ కార్లు దక్షిణాఫ్రికా తీర ప్రాంతంలో సుమారు 4,200 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయనున్నాయి. ఇంధన ధరలు మండిపోతున్న నేటి రోజుల్లో, సౌరశక్తి వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే ఇలాంటి కార్లకు భవిష్యత్తులో మంచి డిమాండ్ ఉండనుంది.

Article Published On: Wednesday, September 5, 2012, 11:50 [IST]
English summary
India's President Pranab Mukherjee on Tuesday flagged off a solar-powered passenger car developed by Delhi Technological University.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+