సోలార్, బ్యాటరీ, పెడల్ పవర్‌తో నడిచే హైబ్రిడ్ రిక్షా

ఇటీవలి కాలంలో భగ్గమంటున్న ఇంధన ధరలు చూస్తుంటే, తక్కువ ఖర్చుతో ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాలు మార్కెట్లో అందుబాటులోకి వస్తే బావుంటుందని అందరు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కార్ మేకర్లు కూడా హైబ్రిడ్, ఎలక్ట్రిక్, సోలార్ కార్ల వంటి వాహనాలను అభివృద్ధి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.

సరే ఇదంతా అటుంచితే, మనకు రిక్షాల గురించి పెద్దగా పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు ఏ రవాణా సౌకర్యాలు లేని రోజుల్లో తొక్కుడు సైకిల్ రిక్షాలకే ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. పైసా ఇంధన ఖర్చు లేకుండా ప్రయాణికులను తమ ప్రాంతాలాకు చేరవేసేందుకు ఇవి ఎంతో చక్కగా ఉపయోగపడేవి. అయితే, ప్రస్తుతం ఆధునిక రవాణా సాధనాలు అందుబాటులోకి కాలక్రమేనా ఇవి కనుమరుగైపోతున్నాయి.


అయితే, ఈ రిక్షాలకు ఓ సరికొత్త హైబ్రిడ్ లుక్‌నిస్తూ వాటికి పనఃజ్జీవం పోసేందుకు కృషి చేస్తున్నాడీ కుర్రాడు. తమిళనాడులోని తిరుపూర్‌కు చెందిన 26 ఏళ్ల శివరాజ్ ముత్తురామ్ ఓ హైబ్రిడ్ రిక్షాకు రూపకల్పన చేశాడు. 'ఎకో ఫ్రీ క్యాబ్'గా పిలిచే ఈ హైబ్రిడ్ రిక్షా ఇటు బ్యాటరీ పవర్‌తోను అటు మ్యాన్యువల్ పెడలింగ్‌తోను పనిచేస్తుంది. అంతేకాదు ఈ బ్యాటరీలను రిక్షా టాప్‌కు అమర్చిన సోలార్ ప్యానెల్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు.

ఈ ఎకో ఫ్రీ క్యాబ్‌లో అమర్చిన బ్యాటరీలను ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 150 కి.మీ. దూరం ప్రయాణించవచ్చు. దీని గరిష్టం వేగం గంటకు 45 కి.మీ. శివరాజ్ ముత్తురామ్ రూపొంబించిన ఈ హైబ్రిడ్ రిక్షాను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించి సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో స్థానం కల్పించింది. సాంప్రదాయ బ్యాటరీ ఆపరేటెడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ సుమారు రూ.4 లక్షల వరకూ ధర ఉంటుండగా, ఎకో ఫ్రీ క్యాబ్‌ను తయారు చేయడానికి కేవలం రూ.80,000 మాత్రమే ఖర్చయిందని శివరాజ్ తెలిపాడు.

More from DriveSpark

Article Published On: Tuesday, September 11, 2012, 16:19 [IST]
English summary
Tamil Nadu: Tirupur-based innovator, Sivaraj Muthuraman has built a hybrid rickshaw called the Eco Free Cab, that runs on solar battery and pedal power.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+