మారుతి నుండి ఎర్టిగా తర్వాత మరో రెండు కొత్త ఉత్పత్తులు
మారుతి సుజుకి ఇండియా తాజాగా మార్కెట్లోకి తమ తొలి ఎమ్‌పివి 'ఎర్టిగా'ను విడుదల చేసిన తర్వాత మరో రెండు కొత్త ఉత్పత్తులతో కార్ ప్రియులను సర్‌ప్రైజ్ చేయనుంది. మారుతి సుజుకి అత్యధికంగా అమ్ముడవుతున్న స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌లో కొత్త వెర్షన్ విడుదల చేసిన తర్వాత కంపెనీ అందిస్తున్న మరో కాంపాక్ట్ కార్ రిట్జ్ హ్యాచ్‌బ్యాక్‌లో సైతం ఓ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది.
అయితే, మారుతి సుజుకి దేశీయ విపణిలో అందిస్తున్న మోడళ్లలో అంతగా విజయం సాధించని ఏ-స్టార్ హ్యాచ్‌బ్యాక్ ఫ్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని కంపెనీ ఓ ఏ-స్టార్ సెడాన్ వేరియంట్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. ఎంట్రీ-లెవల్ స్విఫ్ట్ డిజైర్ సెడాన్‌కు, మిడ్-లెవల్ ఎస్ఎక్స్-4 సెడాన్‌కు మధ్యలో ఈ ఏ-స్టార్ సెడాన్‌ను మారుతి సుజుకి ప్రవేశపెట్టే ఆస్కారం ఉంది.
వచ్చే ఏడాది నాటికి మార్కెట్లోకి రానున్న ఈ సెడాన్ కారు పరిమాణంలో స్విఫ్ట్ డిజైర్ కన్నా పెద్దది గానూ, ధరలో ఎస్ఎక్స్4 కన్నా తక్కువ గానూ ఉండనుంది. స్కొడా ర్యాపిడ్, ఫోక్స్‌వ్యాగన్ వెంటో, నిస్సాన్ సన్నీ మోడళ్లకుగా పోటీగా ఈ కొత్త ఏ-స్టార్ సెడాన్ నిలువనుంది. ఇకపోతే త్వరలో మార్కెట్లోకి రానున్న కొత్త రిట్జ్ ప్రస్తుతం మోడల్ కన్నా రూ.10,000 అధిక ధరను కలిగి ఉండనుంది.


Click it and Unblock the Notifications









