మారుతి ఎర్టిగాకు ఐదు రోజుల్లో పది వేల బుకింగ్‌లు

మారుతి సుజుకి ఇండియా తాజాగా దేశీయ విపణిలోకి విడుదల చేసిన మొట్టమొదటి బహుళ ప్రయోజన వాహనం (ఎమ్‌పివి) ఎర్టిగాకు మార్కెట్ నుండి అశేష ఆదరణ లభిస్తుంది. విడుదలకు ముందు నుంచే ఈ మోడల్‌పై మార్కెట్లో భారీ అంచనాలు ఉండటం, దీనికి తోడు ఆకర్షనీయమైన ధరకే ఈ మోడల్‌ను అందిస్తుండటంతో మార్కెట్లో ఇవి హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.

మారుతి సుజుకి ఇండియా మార్కెట్లో విడుదలైన ఐదు రోజుల్లో 10,000 బుకింగ్‌లను సొంతం చేసుకుని రికార్డును సృష్టించింది. ఒక్క మహారాష్ట్ర రాష్ట్రంలో విడుదలైన మొదటి 400 బుకింగ్‌లను, విడుదలకు ముందు 400 బుకింగ్‌లను ఎర్టిగా సొంతం చేసుకుంది. గతంలో మారుతి సుజుకి తమ కొత్త స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేసినప్పుడు ఆ మోడల్‌కు కూడా ఇలానే బుకింగ్‌లు వెల్లువలా వచ్చి పడ్డాయి.


ఇక మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్‌పివి విషయానికి వస్తే, ఇందులో తొలిసారిగా మారుతి సుజుకి అభివృద్ధి చేసిన 1.4 లీటర్ కె14 వివిటిఐ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 6000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 95 పిఎస్ (70 కి.వా.)ల శక్తిని, 4000 ఆర్‌పిఎమ్ వద్ద 130 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరు పెట్రోల్‌కు 16.02 కి.మీ. మైలేజీని ఇస్తుంది.

ఇక డీజిల్ వేరియంట్ ఎర్టిగా విషయానికి వస్తే, ఇందులో అమర్చిన 1.3 లీటర్ డిడిఐఎస్ సూపర్‌టర్బో విజిటి డీజిల్ ఇంజన్ 4000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 90 పిఎస్ (66 కి.వా.)ల శక్తిని, 1750 ఆర్‌పిఎమ్ వద్ద 200 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరు డీజిల్‌కు 20.77 కి.మీ. మైలేజీని ఇస్తుంది. ఆరు వేరియంట్లలో లభ్యం కానున్న మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్‌పివి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

* ఎర్టిగా ఎల్ఎక్స్ఐ (పెట్రోల్) రూ.5.89 లక్షలు
* ఎర్టిగా విఎక్స్ఐ (పెట్రోల్) రూ.6.60 లక్షలు
* ఎర్టిగా జెడ్ఎక్స్ఐ (పెట్రోల్) రూ.7.30 లక్షలు
* ఎర్టిగా ఎల్‌డిఐ (డీజిల్) రూ.7.30 లక్షలు
* ఎర్టిగా విడిఐ (డీజిల్) రూ.7.90 లక్షలు
* ఎర్టిగా జెడ్‌డిఐ (డీజిల్) రూ.8.45 లక్షలు

More from DriveSpark

Article Published On: Wednesday, April 18, 2012, 15:23 [IST]
English summary
Its seems that the newly launched Ertiga LUV (Life Utility Vehicle), as Maruti Suzuki calls it, is living up to the expectations of the India auto major. The Ertiga MPV has received a record breaking 10,000 bookings in just five days of its launch.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+