డీజిల్ కార్లపై ఎక్సైజ్ సుంఖం పెంచాలి: చమురు శాఖ
ఈ నేపథ్యంలో డీజిల్ కార్లపై ఎక్సైజ్ సుంఖాన్ని పెంచినట్లయితే, డీజిల్ కార్ల ధరలు మరింత పెరిగి, వీటి అమ్మకాలు తగ్గుముఖ పట్టగలవని, ఫలితంగా డీజిల్ ఇంధన వినియోగం తగ్గుతుందనేది సర్కారు భావన. దీనికితోడు ప్రస్తుతం డీజిల్ ఇంధనాన్ని సబ్సిడి ధరకే విక్రయిస్తుండటంతో సర్కారుపై సబ్సిడి భారం తడిసి మోపెడవుతోంది. ఈ పరిస్థితులను గమనించిన కేంద్ర చమురు సహజవాయువు మంత్రిత్వశాఖ డీజిల్ కార్లపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది.
ప్రస్తుతం ఆర్థిక సంవత్సర (2012-13) బడ్జెట్ ప్రతి పాదనల్లో పెట్రోలియం సహజవాయువు మంత్రిత్వశాఖ ఈ ప్రతిపాదనను చేసిందని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి ఎస్‌ఎస్ పళనిమానిక్యం రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. తాజా గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా వినియోగం అవుతున్న మొత్తం డీజిల్‌లో దాదాపు 15 శాతాన్ని ప్యాసింజర్ కార్లే తాగేస్తున్నాయి.


Click it and Unblock the Notifications









