అక్టోబర్ 15న మార్కెట్లోకి రానున్న కొత్త ఫోర్డ్ ఫిగో

ఫోర్డ్ ఫిగోను కంపెనీ తొలిసారిగా మార్చ్ 2010లో దేశీయ విపణిలో ప్రవేశపెట్టింది. అప్పటి నుండి సుమారు రెండు లక్షలకు పైగా ఫోర్డ్ ఫిగో కార్లను కంపెనీ విక్రయించింది. ఈ నేపథ్యంలో, మారుతున్న మార్కెట్ పరిస్థితులు, వినియోగదారుల అభిరుచులను దృష్టిలో ఉంచుకొని ఫోర్డ్ ఇండియా మరిన్ని అదనపు హంగులతో కొత్త ఫిగోను తీర్చిదిద్దింది. రిఫ్రెష్డ్ హెడ్‌ల్యాంప్స్, సరికొత్త ఫ్రంట్ బంపర్, కొత్త ఫాగ్ ల్యాంప్స్, రీస్టయిల్ చేయబడిన టెయిల్ ల్యాంప్స్, కీలెస్ ఎంట్రీ, ఇంజన్ స్టార్ట్ / స్టాప్ బటన్, కొత్త ఆకర్షనీయమైన బాడీ కలర్స్, రిఫ్రెష్డ్ ఇంటీరియర్స్ వంటి మార్పులతో అప్‌గ్రేడెడ్ ఫిగో మార్కెట్లో ఈ పండుగ సీజన్‌లో సందడి చేయనుంది.
ఫోర్డ్ ఫిగో ఈ సెగ్మెంట్లోని మారుతి సుజుకి స్విఫ్ట్, హ్యుందాయ్ ఐ20, నిస్సాన్ మైక్రా, రెనో పల్స్, టొయోటా ఎతియోస్ లివా హోండా బ్రయో వంటి మోడళ్లకు పోటీగా నిలువనుంది. కాగా.. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఫోర్డ్ ఫిగో డ్యూరాటార్క్ డీజిల్ వేరియంట్‌పై కంపెనీ రూ.28,000 డిస్కౌంట్‌ను కూడా ఆఫర్ చేస్తుంది. అయితే, కొత్త ఫోర్డ్ ఫిగోలో యాంత్రికంగా ఎలాంటి మార్పులు ఉండే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుత వెర్షన్లలో ఉపయోగించిన పెట్రోల్, డీజిల్ ఇంజన్లనే కొత్త ఫిగోలో కూడా ఉపయోగించనున్నారు.
ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఫోర్డ్ ఫిగో పెట్రోల్, డీజిల్ వెర్షన్లలో అందుబాటులో ఉంది. పెట్రోల్ వెర్షన్ ఫిగోలో 1196సీసీ 16-వాల్వ్ డిఓహెచ్‌సి, సీక్వెన్షియల్ ఎలక్ట్రిక్ ఫ్యూయెల్ ఇంజెక్షన్ (ఎస్ఈఎఫ్ఐ) ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 6250 ఆర్‌పిఎమ్ వద్ద 71 పిఎస్‌ల శక్తిని, 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 102 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, డీజిల్ వెర్షన్ ఫిగోలో 1399సీసీ 8-వాల్వ్ ఎస్ఓహెచ్‌సి, కామన్ రెయిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 69 పిఎస్‌ల శక్తిని, 2,000 ఆర్‌పిఎమ్ వద్ద 160 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇవి రెండూ కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‍తో లభ్యమవుతాయి.


Click it and Unblock the Notifications








