జనీవాలో ఐ20 ఫ్లూయిడిక్‌ను విడుదల చేసిన హ్యుందాయ్
యూరోపియన్ మార్కెట్ కోసం హ్యుందాయ్ ఇందులో హ్యుందాయ్ బ్లూ డ్రైవ్ టెక్నాలజీతో అభివృద్ధి చేసిన 1.1 లీటర్, 3-సిలిండర్, 'యూ-2' డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 74 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేస్తుంది. అంతేకాకుండా ఇది ప్రతి కిలోమీటరుకు 84 గ్రాముల కార్బన్ డై ఆక్సైడ్‌ను మాత్రమే విడుదల చేస్తుంది. ప్రస్తుతం లభిస్తున్న 1.4 లీటర్ డీజిల్ ఇంజన్ యాధావిధిగా కొనసాగనుంది.
సరికొత్త హ్యుందాయ్ ఐ20 ముందు భాగాన్ని గమనించినట్లయితే, కంపెనీ పాపులర్ ఫ్లూయిడిక్ డిజైన్ స్పష్టంగా కనిపిస్తుంది. ఫ్రంట్ బంపర్‌ను పూర్తిగా సరికొత్త స్టయిల్‌తో రీడిజైన్ చేయటం జరిగింది. ఫ్రంట్ ఫాగ్‌ల్యాంప్స్, మరింత విశాలమైన చైన్, అప్‌డేట్ చేయబడిన హుడ్ డిజైన్, రీడిజైన్ చేయబడిన రియర్ టెయిల్ ల్యాంప్స్, సరికొత్త రియర్ బంపర్, సరికొత్త అల్లాయ్ వీల్స్ డిజైన్ వంటి మార్పులను కొత్త ఫేస్‌లిఫ్ట్ ఐ20 ఫ్లూయిడిక్‌లో గమనించవచ్చు.
కొత్త హ్యుందాయ్ ఐ20 ఫ్లూయిడిక్‌లో మార్పులు:
ఇప్పటికే పాత ఐ20 హ్యాచ్‌బ్యాక్ కోసం కొత్త బుకింగ్‌లు తీసుకోవటాన్ని నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సరికొత్త ఐ20 ఫ్లూయిడిక్ వీలనైంత త్వరలోనే భారత మార్కెట్లోకి కూడా ప్రవేశించనుంది. ఇక దీని ధర విషయానికి వస్తే, ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఐ20 కన్నా కాస్తంత అధికంగా ఉండే అవకాశం ఉంది. హ్యుందాయ్ ఐ20 ఫ్లూయిడిక్ ఇదే సెగ్మెంట్లో లభిస్తున్న కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్, 2012 ఫియట్ గ్రాండే పుంటో, కొత్త హోండా జాజ్ మోడళ్లకు పోటీగా నిలువనుంది.


Click it and Unblock the Notifications









