ఫెరారీ ఎఫ్12 బెర్లినెట్టా: గంటకు 340 కి.మీ. పైగా వేగం...
ఫెరారీ అనగానే మనకు టక్కున గుర్తుకు వచ్చేవి జయ్.. జయ్..నేలపై విమానం దూసుకెళ్లే వేగవంతమైన స్పోర్ట్స్ కార్లు. ప్రపంచ వ్యాప్తంగా స్పోర్ట్ కార్ల తయారీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్‌ను క్రేజ్‌ను సంపాధించుకున్న ఫెరారీ, మరో అద్భుతాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. ఇదివరకెన్నడూ తయారు చేయనంతటి వేగవంతమైన కారును తయారు చేసి ఫెరారీ శభాష్ అనిపించుకుంది.
గంటకు 340 కి.మీ.కు పైగా వేగంతో ప్రయాణించే "ఫెరారీ ఎఫ్12 బెర్లినెట్టా" కారును కంపెనీ ఆవిష్కరించింది. ఫెరారీ చరిత్రలోనే ఇది అత్యంత శక్తివంతమైన రోడ్ కారు. ఈనెల 6న జరగనున్న 2012 జెనీవా మోటార్ షోలో కంపెనీ ఫెరారీ ఎఫ్12 బెర్లినెట్టా కారును ప్రదర్శించనుంది. ఇందులో శక్తివంతమైన 6262సీసీ 65 డిగ్రీ వీ12 ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 730 బిహెచ్‌పిల శక్తిని, 590 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది.
ఈ ఇంజన్ ఎఫ్1 డ్యూయెల్-క్లచ్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ కొత్త కారులో ఇంధన వినియోగాన్ని 30 శాతం వరకూ, కర్భన వ్యర్థాలను 350 గ్రా/కి.మీ.కు తగ్గించడం జరిగింది. ఈ ఇంజన్ కేవలం 3.1 సెకన్లలో 0-100 కి.మీ వేగాన్ని, 8.5 సెకన్లలో 0-200 కి.మీ. వేగాన్ని పుంజుకుంటుంది.


Click it and Unblock the Notifications









