హైదరాబాద్‌లో తొలి షోరూమ్‌‌ను ప్రారంభించిన ఫియట్

ఇప్పటి వరకూ దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్‌తో కలిసి కార్లను విక్రయిస్తూ వచ్చిన ఇటాలియన్ కార్ మేకర్ ఫియట్ ఇకపై ఇండియాలో ఒంటరి ప్రయాణాన్ని సాగించినుంది. ఇందులో భాగంగానే ఫియట్ ఇండియా తమ మొట్టమొదటి షోరూమ్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. బంజారా హిల్స్ పున్నయ్య ప్లాజా వద్ద ఈ కొత్త డీలర్‌షిప్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఫియట్ ఇండియా పేర్కొంది.

హైదరాబాద్‌లోని తేజశ్వని మోటార్స్ ఫియట్‌కు అధీకృత డీలర్‌గా వ్యహవరించనుంది. సుమారు 5,400 చ.అ. విస్తీర్ణంలో ఈ షోరూమ్‌ ఏర్పాటు చేయబడింది. ఫియట్ ఇండియా హెడ్ (కమర్షియల్) ఎన్రికో ఆస్టనాసియో ఈ కొత్త డీలర్‌షిప్‌ను ప్రారంభించారు. ప్రత్యేకించి ఫియట్ కార్ల కోసం దేశవ్యాప్తంగా మరిన్ని ఎక్స్‌క్లూజివ్ ఫియట్ షోరూమ్‌లను ప్రారంభిస్తామని, అంతేకాకుండా మరిన్న కొత్త బ్రాండ్‌లను, కార్లను ఇండియాకు పరిచయం చేస్తామని ఆయన తెలిపారు.

ఫియట్ 2007వ సంవత్సరంలో కార్ల పంపిణీ (డిస్ట్రిబ్యూషన్), సర్వీసింగ్‌ల కార్యకలాపాల కోసం టాటా మోటార్స్‌తో ఓ డీల్‌ను కుదుర్చుకుంది. ఇరు కంపెనీల మధ్య కుదిరిన ఈ 50:50 జాయింట్ వెంచర్ పంపిణీ భాగస్వామ్యంలో భాగంగా, టాటా మోటార్స్ వాహనాలను విక్రయించే స్థలంలోనే ఫియట్ తమ వాహనాలను కూడా విక్రయిస్తూ వచ్చింది. అయితే, దీని వలన ఫియట్‌కు ఏ మాత్రం లబ్ధి చేకూరకపోవటంతో, భారత్‌లో తామే స్వతహాగా కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయించింది.

ప్రస్తుతం ఫియట్ భారత మార్కెట్లో రెండు మోడళ్లను మాత్రమే అందిస్తుంది. లీనియా 2012 సెడాన్, గ్రాండే పుంటో 2012 హ్యాచ్‌బ్యాక్ మరియు లీనియాలో మరో వేరియంట్ లీనియా టి-జెట్ మోడళ్లను కంపెనీ అందిస్తోంది.

More from DriveSpark

Article Published On: Thursday, May 10, 2012, 12:38 [IST]
English summary
Italian carmaker Fiat, which ended a six-year distribution deal with India's Tata Motors, has opened its first exclusive showroom in Hyderabad. Fiat India's first independent dealers is Tejaswini Motors located at Banjara Hills in Hyderabad.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+