దీపావళి కానుకగా రానున్న కొత్త 2013 ఫియట్ లీనియా!
ఇటలీకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫియట్ ఇండియా దేశీయ విపణిలో అందిస్తున్న లీనియా సెడాన్‌లో మరో సరికొత్త వెర్షన్‌ను మార్కెట్లోకి విడుదల చేయనుంది. గడచిన జనవరి నెల ఆరంభంలో 2012 వెర్షన్ లీనియా సెడాన్, పుంటో హ్యాచ్‌బ్యాక్‌లను ఫియట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు తాజాగా ఇందులో అప్‌గ్రేడెడ్ 2013 వెర్షన్ లీనియా సెడాన్‌ను విడుదల చేసేందుకు ఫియట్ సన్నాహాలు చేస్తుంది.
ఇప్పటికే 2013 వెర్షన్‌ను ఫియట్ ఇండియన్ మార్కెట్లో టెస్ట్ రన్ కూడా నిర్వహిస్తోంది. ప్రస్తుతం సరికొత్త 2013 వెర్షన్ ఫియట్ లీనియా ఫోటోలను కంపెనీ విడుదల చేసింది. వాస్తవానికి 2013 ఫియట్ లీనియా వచ్చే ఏడాది ఆరంభంలో మార్కెట్లోకి విడుదల కావల్సి ఉంది. అయితే, కంపెనీ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం, వచ్చే పండుగ సీజన్‌లోనే (బహుశా దీపావళి సీజన్ కావచ్చు) ఈ కొత్త వెర్షన్‌ను ఫియట్ మార్కెట్లో విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
కొత్త 2013 వెర్షన్ ఫియట్ లీనియాలో అనేక మార్పులు చోటు చేసుకోనున్నాయి. కంపెనీ విడుదల చేసిన ఈ ఫోటోలను బట్టి గమనిస్తే.. 2013 వెర్షన్ ఫియట్ లీనియా సెడాన్‌లో సరికొత్త ఫ్రంట్ డిజైన్, రియర్ డిజైన్ మార్పులను గమనించవచ్చు. ఇంకా సరికొత్త హెడ్‌లైట్స్ డిజైన్, క్రోమ్ కోడటెడ్ ఫ్రంట్ గ్రిల్, కొత్త ఫ్రంట్ ఫెండర్, కొత్త డిజైన్ కలిగిన అల్లాయ్ వీల్స్, కొత్త టెయిల్ ల్యాంప్స్, కొత్త బూట్ లిడ్ వంటి మార్పులను గమనించవచ్చు.
కొత్త వెర్షన్ లీనియా ఇంటీరియర్స్‌లో కూడా కొద్ది పాటి మార్పులను మనం అంచనా వేయవచ్చు. ప్రస్తుతం లీనియీలో ఉపయోగిస్తున్న ఇంజన్లను మరింత శక్తివంతగా తీర్చడమే కాకుండా, ఇందులో 1.4 లీటర్ మల్టీఎయిర్ ఇంజన్ కూడా ఉపయోగించే ఆస్కారం ఉంది. ఇది గరిష్టంగా 168 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. నాన్-మల్టీఎయిర్ వెర్షన్ ఇంజన్ 153 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఏదేమైనప్పటి, ఈ ఏడాది చివరి నాటికి ఈ మోడల్ మార్కెట్లో లభ్యం కావచ్చని అంచనా.
గడచిన జనవరిలో మెరుగైన మైలేజ్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఆటో ఆన్-ఆఫ్ లైట్స్, గ్రౌండ్ క్లియరెన్స్ వంటి మార్పులతో కూడిన అప్‌గ్రేడెడ్ 2012 వెర్షన్ పుంటో, లీనియాలను కంపెనీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. 2013 వెర్షన్ లీనియా సెడాన్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం తెలుగు డ్రైవ్ స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.


Click it and Unblock the Notifications









