అందాల భామ అసిన్ వద్ద అందమైన కార్లు..!!
'లంచుకొస్తావా.. మంచెకొస్తావా... కోణ్ణి కోస్తావా కన్నె డిన్నరిస్తావా...' అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి సినిమాలో అమాయక పాత్ర పోషించి తెలుగు ప్రేక్షకులను అలరించిన హీరోయిన్ అసిన్‌కు విలాసవంతమైన కార్లంటే మహా ఇష్టం. ఈ అందాల భామకు ఇటీవలే తమ తల్లిదండ్రులు ఓ బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 కారును బహుమతిగా ఇచ్చారట.
అసిన్ హాజరయ్యే సినిమా ఫంక్షన్లు, కార్యక్రమాలకు ఈ సెలూన్ కారులో వెళ్తుంది. అసిన్ తల్లిదండ్రులు 2010లో అసిన్ పుట్టిన రోజు కానుగా ఓ ఆడి కారును, 2009లో గజనిలో తాను చేసిన అద్భుతమై పాత్రకు గానూ ఓ మెర్సిడెస్ బెంజ్ కారును బహుమతిగా ఇచ్చారు (ఎంత మంచి పేరెంట్సో కదా..).
అసిన్ వద్ద ఇవే కాకుండా.. టొయోటా క్యామ్రే ప్రీమియం సెడాన్ కూడా ఉంది. అసిన్‌కు న్యూమరాలజీ (సంఖ్యాశాస్త్రం) అంటే పిచ్చి నమ్మకమని పరిశ్రమలో టాక్. అసిన్ లక్కీ నెంబర్ 4, అందుకే అసిన్ కార్లపై ఈ సంఖ్యతో కూడిన నెంబర్ ప్లేట్లే దర్శనమిస్తాయి. అసిన్ కేవలం తెలుగు సినీ పరిశ్రమలోనే కాకుండా, హిందీ, తమిళం, మళయాలం చిత్రాల్లో కూడా నటించి అభిమానుల ప్రశంసలు అందుకుంది.


Click it and Unblock the Notifications









