ఆటోమేటిక్ ఫియస్టాను విడుదల చేసిన ఫోర్డ్ ఇండియా
ఆటోమేటిక్ ఫోర్డ్ ఫియస్టాలో ఉపయోగించిన 1.5 లీటర్ టిఐ-విసిటి ఇంజన్ 110 బిహెచ్‌పిల శక్తిని, 140 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం, ఆటోమేటిక్ వెర్షన్ ఫియస్టా సెడాన్ లీటరుకు 16.97 కి.మీ. మైలేజీనిస్తుంది. ఈ సెగ్మెంట్లో లభిస్తున్న ఆటోమేటిక్ వేరియంట్లలో కెల్లా ఇదే అత్యుత్తమ మైలేజీనిచ్చే కారుగా నిలవనుంది. మైలేజ్ విషయంలో మ్యాన్యువల్ వేరియంట్లతో కూడా ఇది తలపడనుంది.
మరిన్ని ఫోర్డ్ ఫియస్టా ఫోటోలు/వాల్ పేపర్ల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
ఫియస్టా ఆటోమేటిక్ సెడాన్‌లో హిల్ అసిస్ట్ ఫీచర్ లభిస్తుంది. ఎటువాలు ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు ఈ హిల్ అసిస్ట్ ఫీచర్ చక్కగా ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్‌ను ఆన్ చేయడం ద్వారా ఎటువాలు రోడ్డుపై కారును నిలిపి, బ్రేక్ నుండి యాక్సిలరేటర్‌కు మారినప్పుడు కారును వెనక్కు వెళ్లకుండా ఉండేందకు ఇది సహకరిస్తుంది.
ఫియస్టా ఆటోమేటిక్‌లో ఉపయోగించిన ఆటోమేటిక్ గేర్ బాక్స్‌కు పదేళ్ల పాటు లేదా 2,40,000 కి.మీ. వరకూ మెయింటినెన్స్ అవసరం లేదని కంపెనీ పేర్కొంది. ఫియస్టా ఆటోమేటిక్ స్టయిల్ వేరియంట్ ధర రూ.8.99 లక్షలగానూ, టైటానియం ప్లస్ వేరియంట్ రూ.9.70 లక్షలుగానూ ఉంది.
ఆటోమొబైల్స్‌కు సంబంధించి మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం మా ఫేస్‌బుక్ ఫ్యాన్ పేజ్‌ను సందర్శించండి. http://www.facebook.com/drivespark
ఇప్పుడు ఆటోమొబైల్ వార్తలను మీ మొబైల్ ఫోన్‌లో కూడా పొందవచ్చు. ఇందుకు మీరు చేయాల్సిందిల్లా మీ మొబైల్ బ్రౌజర్‌లో http://m.drivespark.com/ వెబ్‌సైట్ అడ్రెస్ టైప్ చేయటమే.


Click it and Unblock the Notifications









