భారత్‌లో రెండేళ్లు పూర్తి చేసుకున్న ఫోర్డ్ ఫిగో..!!

అమెరికా ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్ ఇండియా భారత మార్కెట్లో విక్రయిస్తున్న ఫిగోకు అప్పుడే రెండేళ్లు నిండిపోయాయి. ఫోర్డ్ బుజ్జి కారు ఫిగో దేశీయ విపణిలో విడుదలై రెండు సంవత్సరాలు పూర్తి కావస్తున్న నేపథ్యంలో కంపెనీ సంబరాలు చేసుకుంటుంది. ఇందులో భాగంగా, ఈ వేడుకల సమయంలో ఫోర్డ్ డీలర్‌షిప్‌లను సందర్శించే వారికి కంపెనీ కానుకలను అందించనుంది.

అంతేకాకుండా.. ఫిగో కొనుగోలుపై ఉచిత ఇన్సూరెన్స్ రూపంలో రూ.16,000 డిస్కౌంట్‌ను కూడా ఫోర్డ్ అందిస్తోంది. మార్చి 9, 2012వ తేదీతో ఫోర్డ్ ఫిగో కారుకు ఇండియాలో రెండు సంవత్సరాలు నిండనున్నాయి. ఒకప్పుడు ఇండియాలో ఫోర్డ్ బ్రాండ్ కార్లంటే చాలా అధిక ధరను కలిగి ఉండి, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేవి కావు. అయితే, భారత మార్కెట్లోకి ఫిగో ప్రవేశించిన తర్వాత దేశీయ విపణిలో ఫోర్డ్ ఇండియా దశ తిరిగింది.

నాలుగు లక్షల రూపాయల ధర రేంజ్‌లో భిస్తున్న ఫోర్డ్ ఫిగో ఈ సెగ్మెంట్లో ఎన్నో ప్రముఖ మోడళ్లను ఎదురవుతున్న పోటీని తట్టుకుని దూసుకుపోతుంది. ఫోర్డ్ పెట్రోల్ (1.2 లీటర్ డ్యూరాటెక్), డీజిల్ (1.4 లీటర్ డ్యూరాటార్క్) ఇంజన్ ఆప్షన్లతో లభ్యమవుతుంది. పెట్రోల్ వేరియంట్ ఫిగో 71 పిఎస్‌ల శక్తిని, 101 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుండగా, డీజిల్ వేరియంట్ ఫిగో 69 పిఎస్‌ల శక్తిని, 160 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, March 7, 2012, 18:35 [IST]
English summary
Ford India's best selling hatchback Ford Figo is celebrating its second anniversary on 9th March 2012. On this occasion, those who visit the Ford India's outlets will get attractive gifts, while customers will receive Rs. 16000 discount in terms of free insurance.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+