వెయిటింగ్ పీరియడ్ తగ్గించేందుకు ఉత్పత్తిని పెంచిన ఫోర్డ్

అమెరికన్ ఆటో దిగ్గజం ఫోర్డ్ భారత మార్కెట్లో అందిస్తున్న ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుండటంతో వాటి ఉత్పత్తిని కూడా పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు ఫోర్డ్ ఇండియాకు చెన్నై ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచనుంది. ఈ ప్లాంట్ ప్రస్తుతతం సంవత్సరానికి 2.50 లక్షల యూనిట్లను తయారు చేస్తుండగా, దీనిని 3.30 లక్షల యూనిట్లకు పెంచాలని నిర్ణయించింది.

ఈ అదనపు ఉత్పత్తి సామర్థ్యానికి గానూ గడచిన సంవత్సరంలో ప్రకటించిన 72 మిలియన్‌ డాలర్లను పెట్టుబడిగా వెచ్చించనున్నామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 2011లో 72 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులను వెచ్చిన అదనంగా 80,000 యూనిట్లను ఉత్పత్తి చేయాలని కంపెనీ అప్పట్లో నిర్ణయించింది. ప్రస్తుతం ఆ నిర్ణయాన్ని అమల్లోకి తీసుకువస్తున్నామని ఫోర్డ్ తెలిపింది.


కాగా.. ఫోర్డ్ ఇండియా చెన్నై ఇంజన్ ప్లాంట్‌లో నాలుగు లక్షల ఇంజిన్లను ఉత్పతిని పూర్తి చేసుకున్న సందర్భంగా కంపెనీ నూతన ఉత్సాహంతో సంబంరాలు జరుపుకుంటోందని ఫోర్డ్‌ ఇండియా అధ్యక్షుడు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ మైఖేల్‌ బోన్‌హామ్‌ తెలిపారు. చెన్నైలోనే మరో ప్లాంటును ఏర్పాటు చేయాలని ఫోర్డ్ యోచిస్తోంది. చెన్నైకు సుమారు 60 కి.మీ. దూరంలో ఉన్న మరైమలైయ్‌నగర్‌లో కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నామని, ఈ ప్లాంటును మరో 14 నెలల్లో పూర్తి చేస్తామని ఆయన అన్నారు.

కొత్తగా ఏర్పాటు చేయనున్న ఈ ప్లాంటులో అదనంగా 80,000 డీజిల్‌ ఇంజిన్లను తయారు చేస్తామని, ఈ కొత్త ప్లాంట్ ద్వారా అదనంగా 200 మందికి ఉపాధి కల్పించనున్నామని, ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా ఫోర్డ్ ఇండియా తాజాగా రూ.5.53 లక్షల ప్రారంభ ధరకే కొత్త ఫోర్డ్ క్లాసిక్ సెడాన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా.. ఫోర్డ్ ఇండియా అందిస్తున్న చిన్న కారు ఫోర్డ్ ఫిగోలో కూడా ఓ ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, July 18, 2012, 12:08 [IST]
English summary
Ford India has said, its facility in Chennai now will produce 3.30 lakh engines per annum and it would bring down the waiting period for diesel powered vehicles to three weeks.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+