ఫిబ్రవరి 28న ఆటోమేటిక్ ఫియస్టాను విడుదల చేయనున్న ఫోర్డ్
ఈనెల 28వ తేదీన ఆటోమేటిక్ ఫియస్టా సెడాన్ మార్కెట్లోకి రానుంది. అయితే, ఏమాటకు ఆమాటే చెప్పుకోవాలి. ధర కాస్తంత ఎక్కువ అనిపించనప్పటికీ, సి-సెగ్మెంట్ సెడాన్‌లో గ్లోబల్ ఫియస్టా టెక్నాలజీ పరంగా శభాష్ అనిపించుకుంటుంది. కాగా.. కొత్తగా మార్కెట్లోకి రానున్న ఆటోమేటిక్ వేరియంట్ ఈ సెగ్మెంట్లో మరింత పోటీ ఏర్పడనుంది. అయితే, ఆటోమేటిక్ ఫియస్టా కేవలం పెట్రోల్ వేరియంట్లో మాత్రమే లభ్యమయ్యే అకాశాలు కనిపిస్తున్నాయి.
డీజిల్ వేరియంట్లో ఆటోమేటిక్ వెర్షన్‌ను ఫోర్డ్ ఇప్పట్లో పరిచయం చేయకపోవచ్చు. ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్ కలిగిన ఫోర్డ్ ఫియస్టాలో హిల్ లాంచ్ అసిస్ట్, గ్రేడ్ అసిస్ట్, మైక్రో స్లిప్, క్రీప్ ఫార్వార్డ్ ఫంక్షన్, న్యాచురల్ కోస్ట్ డిజైన్, అధిక మైలేజ్, లెథర్ సీటింగ్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి.
ప్రస్తుతం ఫోర్డ్ ఫియస్టా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో 1.5 లీటర్ టిఐవీసీటీ పెట్రోల్ ఇంజన్‌తో లభిస్తుంది. ఆటోమేటిక్ వెర్షన్ ఫియస్టాలో 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఉండనుంది. ఆటోమేటిక్ ఫోర్డ్ ఫియస్టాకు సంబంధించిన మరిన్ని వివరాలు ఫిబ్రవరి 28న తెలియనున్నాయి. కొత్త ఫోర్డ్ ఫియస్టా గురించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం డ్రైవ్ స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.


Click it and Unblock the Notifications









