రూ.3.85 లక్షలకే సరికొత్త ఫిగోని విడుదల చేసిన ఫోర్డ్

అమెరికాకు చెందిన కార్ కంపెనీ ఫోర్డ్ ఇండియా దేశీయ విపణిలో అందిస్తున్న బుజ్జి కారు 'ఫోర్డ్ ఫిగో' ఓ సరికొత్త అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను కంపెనీ నేడు మార్కెట్లో విడుదల చేసింది. కొత్త ఫోర్డ్ ఫిగో ప్రారంభ ధర కేవలం రూ. 3.85 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) మాత్రమే. ఫోర్డ్ ఇండియా తాజాగా మార్కెట్లోకి విడుదల చేసిన ఈ సరికొత్త ఫోర్డ్ ఫిగో రెండవ తరానికి (సెకండ్ జనరేషన్) చెందినది. మొదటి తరం (ఫస్ట్ జనరేషన్) ఫోర్డ్ ఫిగోను కంపెనీ మార్చ్ 2010లో మార్కెట్లోకి విడుదల చేయటం జరిగింది.

ఇండియాలో కంపెనీ ఇప్పటి వరకూ 2.35 లక్షలకు పైగా ఫోర్డ్ ఫిగో కార్లను విక్రయించింది. కొత్త ఫోర్డ్ ఫిగో పెట్రోల్ డీజిల్ వేరియంట్లలో లభ్యమవుతుంది. పెట్రోల్ వెర్షన్ ఫిగోలో 1.2 లీటర్, 16-వాల్వ్, డిఓహెచ్‌సి డ్యూరాటెక్ ఇంజన్‌ను ఉపయోగించారు. డీజిల్ వెర్షన్ ఫిగోలో 1.4 లీటర్, 8-వాల్వ్ ఎస్ఓహెచ్‌సి ఇంజన్‌ను ఉపయోగించారు. పెట్రోల్, డీజిల్ వెర్షన్లలో ప్రారంభ వేరియంట్ల ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

  • 2012 ఫోర్డ్ ఫిగో (పెట్రోల్) - రూ.3,84,999
  • 2012 ఫోర్డ్ ఫిగో (డీజిల్) - రూ.4,81,999

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)


కొత్త ఫోర్డ్ ఫిగోలోని ప్రతి వెర్షన్‌లో నాలుగు వేరియంట్లు (ఎల్ఎక్స్ఐ, ఈఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ, టైటానియం) అందుబాటులో ఉంటాయి. కొత్త ఫోర్డ్ ఫిగో ప్రధాన ఫీచర్లు:
  • కొత్త హెడ్‌ల్యాంప్స్
  • కొత్త క్రోమ్ గ్రిల్, ఫెండర్
  • కొత్త టెయిల్ ల్యాంప్స్
  • విశాలమైన ఇంటీరియర్స్
  • బ్లూటూత్ కనెక్టివిటీ
  • స్టీరింగ్ వీల్‌పై ఏర్పాటు చేయబడిన ఆడియో కంట్రోల్స్
  • మరింత విశాలమైన బూట్ స్పేస్
  • ఆకర్షనీయమైన అల్లాయ్ వీల్స్
  • బెస్ట్ ఇన్ క్లాస్ ఎయిర్ కండిషనింగ్
  • డ్రైవర్, ప్యాసింజర్‌ల కోసం డ్యూయెల్ ఎయిర్ బ్యాగ్స్
  • ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్‌ (ఈబిడి)తో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్)

కొత్త ఫోర్డ్ ఫిగో ఈ సెగ్మెంట్లోని మారుతి సుజుకి స్విఫ్ట్, హ్యుందాయ్ ఐ20, నిస్సాన్ మైక్రా, రెనో పల్స్, టొయోటా ఎతియోస్ లివా హోండా బ్రయో వంటి మోడళ్లకు పోటీగా నిలువనుంది. పెట్రోల్ వెర్షన్ ఫిగోలో ఉపయోగించిన 1196సీసీ 16-వాల్వ్ డిఓహెచ్‌సి, సీక్వెన్షియల్ ఎలక్ట్రిక్ ఫ్యూయెల్ ఇంజెక్షన్ (ఎస్ఈఎఫ్ఐ) ఇంజన్‌ గరిష్టంగా 71 పిఎస్‌ల శక్తిని, 102 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, డీజిల్ వెర్షన్ ఫిగోలో ఉపయోగించిన 1399సీసీ 8-వాల్వ్ ఎస్ఓహెచ్‌సి, కామన్ రెయిల్ ఇంజన్‌ 69 పిఎస్‌ల శక్తిని, 160 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇవి రెండూ కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‍‌తో లభ్యమవుతాయి.

More from DriveSpark

Article Published On: Monday, October 15, 2012, 13:28 [IST]
English summary
US based auto major Ford India has launched the all new Figo in India at a starting price of Rs 384,999 (ex-showroom, New Delhi). New Figo is available in both petrol and diesel. The petrol model is powered by a 1.2L 16 valve DOHC Duratec while the diesel Figo is powered by a 1.4L 8 valve SOHC.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+