బి-మ్యాక్స్ ఎమ్‌పివి ఇండియాకు తీసుకురానున్న ఫోర్డ్

బారత మార్కెట్లో 2015 నాటికి ఎనిమిది కొత్త మోడళ్లను ప్రవేశపెడతామని కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో ఇప్పటికే, ఫియస్టా గ్లోబల్ సెడాన్‌ను దేశీయ విపణిలో ప్రవేశపెట్టగా, గడచిన జనవరిలో జరిగిన ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో గ్లోబల్ ఎస్‌యూవీ "ఎకోస్పోర్ట్"ను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఫియట్ భారత్‌లో ప్రవేశపెట్టనున్న ఎనిమిది ఉత్పత్తులలో బి-మ్యాక్స్ ఎమ్‌పివి కూడా ఒకటిగా ఉండే అవకాశం ఉంది.
క్రియేటివ్ అవుట్‌లుక్‌తో డిజైన్ చేసిన బి-మ్యాక్స్ ఎమ్‌పివిలో 1.0 లీటర్ పెట్రోల్ 3-సిలిండర్ టర్బో ఇంజన్‌ను ఉపయోగించారు. ఐదుగురు సౌకర్యవంతంగా ప్రయాణించేలా తీర్చిదిద్దిన ఈ ఎమ్‌పివి 4.04 మీటర్ల పొడవను కలిగి ఉండనుంది. ఇంకా ఇందులో ఆటో స్టార్ట్-స్టాప్ ఆప్షన్, ట్విన్ ఇండిపెండెంట్ వేరియబుల్ కామ్ టైమింగ్, డైరెక్ట్ ఇంజెక్షన్ సిస్టమ్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించారు. పర్యావరణానికి హాని కలిగించకుండా తక్కు కర్బన వ్యర్థాలను విడుదల చేసేలా దీన్ని రూపొందించారు.


Click it and Unblock the Notifications








