ఒకే రోజులో 45 షోరూమ్‌లను ప్రారంభించనున్న ఫోర్డ్

Ford EcoSport SUV
అమెరికా ఆటో దిగ్గజం ఫోర్డ్ భారత మార్కెట్ భారీ వాటా కోసం పెద్ద ఎత్తున ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుంది. భారత్‌లో ఫిగో హ్యాచ్‌బ్యాక్, ఫియస్టా సెడాన్‌లతో పాటుగా ఇతర మోడళ్లను విక్రయిస్తున్న ఫోర్డ్ ఇండియా, దేశీయ విపణిలో కొత్తగా 45 షోరూమ్‌లను ప్రారంభించాలని నిర్ణయించింది. అయితే, ఈ 45 షోరూమ్‌లను ఒకే రోజులో ప్రారంభించడం విశేషం.

ఈనెల (ఫిబ్రవరి) 16వ తేదీన ఫోర్డ్ ఇండియా మొత్తం 45 షోరూమ్‌లను దేశవ్యాప్తంగా ప్రారంభించనుంది. ఫోర్డ్ ఇండియా భారత మార్కెట్లో విజయాన్ని సాధించనప్పటికీ, మారుతి సుజుకి, హ్యుందాయ్, టాటా మోటార్స్ వంటి కంపెనీల మాదిరిగా బహుళ ప్రజాదరణ పొందలేదు. ఈ నేపథ్యంలో ఇండియన్ మార్కెట్లో తమ నెట్‌వర్క్‌ను విస్తురించి మరింత కొనుగోలుదారులకు అందుబాటులోకి వచ్చే విధంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

వినియోగదారులకు మరింత సమర్థవంతమైన సేవలను అందిచాలనే ఉద్దేశ్యంతో ఫోర్డ్ తీసుకున్న ఈ నిర్ణయం ఆహ్వానించదగినదే. ఈ షోరూమ్‌లలో ఫిగో, గ్లోబల్ ఫియస్టా, ఫియస్టా క్లాసిక్, ఎండీవియర్ మోడళ్లను విక్రయించనుంది. ఫోర్డ్ ఇలా ఒకేసారి ఇన్న షోరూమ్‌లను ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారేం కాదు. 2010లో కూడా ఫోర్డ్ ఒకేసారి 28 కొత్త షోరూమ్‌లు ప్రారంభించి ఫోర్డ్ ఫిగో కారును విడుదల చేసింది.

అయితే, ఫోర్డ్ ఇండియా మరి ఈసారి ఏ కారును విడుదల చేయబోతుందో తెలియదు కానీ, మా అంచనా కరెక్ట్ అయితే, గడచిన జనవరిలో న్యూఢిల్లీలో జరిగిన 11వ అంతర్జాతీయ ఆటో ఎక్స్‌పోలో కంపెనీ ఆవిష్కరించిన ఎకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీని విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత మార్కెట్లో దీని ధర రూ.8 లక్షల నుండి రూ.11 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.

More from DriveSpark

Article Published On: Tuesday, February 14, 2012, 17:57 [IST]
English summary
Ford Motor is having some big plans for its Indian operations. The American carmaker that sells the Figo and Fiesta among other cars in India is planning to open 45 new showrooms across the country. To add to this all the new ford showrooms in India will be opened on the same day. February 16th has been set as the date for the showroom launches.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+