ఒకేసారి 35 నగరాల్లో 45 షోరూమ్‌లను ప్రారంభించి ఫోర్డ్ ఇండియా

ఫోర్డ్ ఇండియాకు ఈ రోజు చాలా అరుదైన రోజు. భారతదేశపు ఆరవ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన ఫోర్డ్ ఇండియా ఒకేరోజులో దేశవ్యాప్తంగా 35 నగరాల్లో ఒకేసారి 45 షోరూమ్‌లను ప్రారంభించి అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఫోర్డ్ ఇండియా ఈరోజు (ఫిబ్రవరి 16) ప్రారంభించిన మొత్తం 45 షోరూమ్‌లలో డీలర్‌‌షిప్‌లు, ఆఫ్టర్ సేల్స్ అవుట్‌లెట్లు ఉన్నాయని కంపెనీ తెలిపింది.

ఫోర్డ్ ఇండియాకు దేశీయ విపణిలో మారుతి సుజుకి, హ్యుందాయ్, టాటా మోటార్స్ వంటి కంపెనీలకు ఉన్నట్లుగా విస్తృత స్థాయిలో డీలర్‌షిప్ నెట్‌వర్క్‌, సర్వీసింగ్ సెంటర్లు లేకపోవడంతో, అది కంపెనీ అమ్మకాలపై కూడా ప్రభావాన్ని చూపడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఫోర్డ్ ఇండియా, దేశీయ మార్కెట్లో తన పరిమితిను పెంచుకునేకుందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

కొత్తగా ఏర్పాటు చేసిన షోరూమ్‌లో భారత్‌లో ఫోర్డ్ ఇండియా సేల్స్ అండ్ సర్వీస్ అవుట్‌లెట్ల సంఖ్య 230కి పెరిగింది. ప్రస్తుతం 123 నగరాల్లో ఫోర్డ్ తన సేవలను అందిస్తుంది. కొత్తగా ఏర్పాటు చేసిన 45 అవుట్‌లెట్లలో 11 సెంటర్లు కేవలం అమ్మకాల కోసం మాత్రమే నియమించగా, మరో 14 సెంటర్లు కేవలం సర్వీసింగ్ కోసం, మిగిలిన 20 సెంటర్లు సేల్స్ అండ్ సర్వీసింగ్ సేవలను అందించనున్నాయి.

ఈ షోరూమ్‌లలో ఫిగో, గ్లోబల్ ఫియస్టా, ఫియస్టా క్లాసిక్, ఎండీవియర్ మోడళ్లను విక్రయించనుంది. ఫోర్డ్ ఇలా ఒకేసారి ఇన్న షోరూమ్‌లను ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారేం కాదు. 2010లో కూడా ఫోర్డ్ ఒకేసారి 28 కొత్త షోరూమ్‌లు ప్రారంభించి ఫోర్డ్ ఫిగో కారును విడుదల చేసింది. మరి ఫోర్డ్ ఇండియా తాజా చర్యతో కంపెనీ అమ్మకాలు ఏ మేరకు వృద్ధి చెందుతాయో వేచి చూడాల్సి ఉంది.

More from DriveSpark

Article Published On: Thursday, February 16, 2012, 17:31 [IST]
English summary
Ford India has opened 45 new showrooms in 35 cities across the country. Out of the 45 outlets inaugurated today, 11 centers will be dedicated to only sales, 14 exclusively for service factor while the remaining 20 will offer everything sales, service and showroom.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+