పోటీని తట్టుకోవాలంటే కార్ల ధరలను తగ్గించడమే శరణ్యం: ఫోర్డ్

ఫోర్డ్ కార్ల గురించి ఎవరిని అడిగినా చెప్పే సమాధానం ఒక్కటే.. 'ఈ కారుకు అంత డబ్బులు ఖర్చు పెట్టాలా' అని. నిజమే.. ఇండియన్ మార్కెట్లో ఫోర్డ్ కార్లు, ఆ సెగ్మెంట్లోని పోటీదారులతో పోల్చుకుంటే కాస్తంత ప్రీమియంగానే ఉంటాయి. ఫిగో, ఫియస్టా సెడాన్‌ (మ్యాన్యువల్ వెర్షన్)లే ఇందుకు మంచి ఉదాహరణలు. అధిక ధరల కారణంగానే ఫోర్డ్ భారత మార్కెట్లో పెద్దగా రాణించలేకపోతుంది.

ఇన్నాళ్లకు ఈ ఫోర్డ్ తన తప్పు తెలుసుకుంది. ఇప్పటికే భారత మార్కెట్లో కొత్తగా ప్రవేశిస్తున్న మోడళ్లతో పోటీ వాతావరణం మరింత వాడివేడిగా తయారవుతుండటంతో ఫోర్డ్ ఇండియా కొత్త మార్కెట్ వ్యూహాలను సిద్ధం చేసుకుంటుంది. ధరల విషయంలో పోటీదారుల నుండి ఎదురయ్యే పోటీని తట్టుకునేందుకు కంపెనీ అందిస్తున్న మోడళ్ల ధరలను తగ్గించాలని ఫోర్డ్ యోచిస్తోంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి 10 నెలల్లో ఫోర్డ్ ఇండియా అమ్మకాలు 4 శాతం క్షీణించి 75,604 యూనిట్లకు పడిపోయాయి. ఇదే సమయంలో భారత ప్యాసింర్ వాహన మార్కెట్ 9 శాతం మేర వృద్ధి చెందుతోంది. గడచిన జులై నెలలో విడుదలైన గ్లోబల్ ఫోర్డ్ ఫియస్టాను భారత మార్కెట్లో విక్రయించేందుకు కంపెనీ నానా తంటాలు పడుతుంది. ఇందుకు ప్రధాణ కారణం ఫియస్టా అధిక ధరను కలిగి ఉండటమే.

ఫోర్డ్ గ్లోబల్ ఫియస్టా సెడాన్ ప్రారంభ రూ.8.25 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). అయితే, ఇదే సెగ్మెంట్లో లభిస్తున్న హ్యుందాయ్ వెర్నా, హోండా సిటీ, ఫోక్స్‌వ్యాగన్ వెంటో, స్కొడా ర్యాపిడ్ వెంటి మోడళ్లు రూ.6.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధర నుండి లభిస్తుండటంతో ఫోర్డ్ ఫియస్టా అమ్మకాలు మరింత వెనక్కు తగ్గాయి. ఈ నేపథ్యంలో ఫియస్టాపై కంపెనీ రూ.75,000 తగ్గింపును ప్రకటించినప్పటికీ ఫలితం లేకపోయింది.

దీంతో భారత మార్కెట్లో ఉత్పత్తుల ధరలను నిర్ణయించే విషయంలో కంపెనీ పునరాలోచనలో పడింది. పోటీని తట్టుకునే విధంగా కార్ల ధరలను సవరించాలని అవసరం ఎంతైనా ఉందని ఫోర్డ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) నీగెల్ ఈ వార్క్ అన్నారు. దీన్నిబట్టి చూస్తే... త్వరలోనే ఫోర్డ్ కార్ల ధరలు కొండ దిగిరానున్నాయి. మీరేమంటారు..?

More from DriveSpark

Article Published On: Thursday, March 1, 2012, 15:39 [IST]
English summary
Ford India mulling to cut its car prices in India to compete with other rival companies. "There is scope for reviewing our product prices as local market dynamics are changing so fast. While we continue to go strong on the Figo hatchback, prices of other products need to be rationalized in tune with new launches in the market and increased competition." Ford India executive director (marketing & sales) Nigel E Wark said.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+