ఫోర్డ్ ఫిగో, ఫోర్డ్ ఫియస్టా క్లాసిక్ కార్లలో సమస్యలు; రీకాల్
ఈ మేరకు భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) తమ ప్రతిపాదనలను ప్రభుత్వం ముందు ఉంచింది. ఈ నేపథ్యంలో కార్ కంపెనీలన్నీ కూడా ముందస్తుగానే, తమ కార్లలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే మారుతి సుజుకి, టొయోటా, టాటా, హోండా, బిఎమ్‌డబ్ల్యూ వంటి పలు కంపెనీలు ఇండియాలో తమ కార్లను రీకాల్ చేయటం జరిగింది.
కాగా.. తాజాగా అమెరికన్ కార్ కంపెనీ ఫోర్డ్ ఇండియా, భారత మార్కెట్లో అందిస్తున్న ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ ఫోర్డ్ ఫిగో, ఎంట్రీ లెవల్ సెడాన్ ఫోర్డ్ ఫియస్టా క్లాసిక్ (పాత మోడల్) కార్లను రీకాల్ చేసింది. రియర్ ట్విస్ట్ బీమ్ (ఆర్‌టిబి), పవర్ స్టీరింగ్ హోస్ (పిఏఎస్) సంబంధిత సమస్యల కారణంగా కంపెనీ ఈ కార్లను రీకాల్ చేస్తోంది. ఈ రీకాల్ క్రింద కార్లను గుర్తించి, సంబంధిత కస్టమర్లకు ప్రత్యేకంగా కంపెనీ కబురు పంపించనుంది.
సెప్టెంబర్ 2010 మరియు ఫిబ్రవరి 2011 మధ్య కాలంలో తయారైన ఫోర్డ్ ఫిగో, ఫియస్టా క్లాసిక్ కార్లలో రియర్ ట్విస్ట్ బీమ్, పవర్ స్టీరింగ్‌లో సమస్యలు ఉన్నట్లు ఫోర్డ్ ఇండియా అనుమానిస్తోంది. అలాగే, జనవరి 2008 మరియు డిసెంబర్ 2010 మధ్య కాలంలో తయారైన కార్లను కూడా ఫోర్డ్ పరీక్షిస్తోంది. ఒకవేళ ఈ సమస్య నిజమని తేలినట్లయితే, ఈ రెండు మోడళ్లలో పిఏఎస్‌ను కంపెనీ ఉచితంగా రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఇదొక్కటే ఇందుకు పరిష్కారం.


Click it and Unblock the Notifications









