జిఎమ్ చెవర్లే చిన్న కార్ సెగ్మెంట్లో మరో ఐటమ్ నెంబర్!
జనరల్ మోటార్స్ తమ సెయిల్ కారును చైనాలోని తమ భాగస్వామి ఎస్ఏఐసితో కలిసి రూపొందిస్తుంది. మారుతి సుజుకి స్విఫ్ట్, హ్యుందాయ్ ఐ20 మోడళ్లను టార్గెట్ చేసుకని జనరల్ మోటార్స్ సెయిల్‌ను ఇండియాలో ప్రవేశపెట్టనుంది. ఈ మోడల్‌ను జనరల్ మోటార్స్‌కు చెందిన చైనా డివిజన్ రూపొందించినప్పటికీ, దీనిని భారతీయ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేయనున్నారు. సెయిల్‌కు చైనా మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.
చెవర్లే సెయిల్ హ్యాచ్‌బ్యాక్‌లో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ లేదా మరింత శక్తివంతమైన 1.4 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను అమర్చే అవకాశం ఉంది. ఇది డీజిల్ వేరియంట్లో కూడా లభ్యం కానుంది. డీజిల్ వేరియంట్ సెయిల్‌లో 1.3 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించవచ్చని అంచనా. అన్ని వేరియంట్లు కూడా సమర్థవంతమైన 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభ్యం కానున్నాయి.
భారత మార్కెట్లో చెవర్లే సెయిల్ ప్రారంభ ధర రూ.5 లక్షల నుండి మొదలు కానుంది. సెయిల్‌కు సంబంధించిన ఇతర సాంకేతిక వివరాలు, ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం తెలుగు డ్రైవ్ స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.


Click it and Unblock the Notifications









