వాహనాల ధరలను పెంచిన జనరల్ మోటార్స్

GM Price Hike
కొత్త సంవత్సరంలో కొత్త కారు సొంతం చేసుకోవాలనుకునే కొనుగోలుదారులకు చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. ప్రస్తుతం కొత్త కారును కొనుగోలు చేయాలంటే, ఒక్క మోడల్‌ను బట్టి రూ.2,000 నుండి రూ.20,000 వరకూ అధికంగా వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది. అమెరికా ఆటో దిగ్గజం జనరల్ మోటార్స్ కూడా భారత్‌లో తాము అందిస్తున్న వివిధ ఉత్పత్తుల ధరలను 0.5 శాతం నుండి 1.75 శాతం మేర పెంచుతున్నట్లు ప్రకటించింది.

తాజా పెంపుతో జనరల్ మోటార్స్ అందిస్తున్న స్పార్క్‌, బీట్‌, క్రూజ్‌, తవేరా తదితర మోడళ్ల ధరలు రూ.3,000 నుండి రూ.15,000 వరకూ పెరిగాయి. వేల రూపాయల వరకూ రేట్లను పెంచినట్టు ప్రకటించింది. అయితే భారత మార్కెట్‌‌ను పెద్దగా ఆకట్టుకోని ఏవియో, ఆప్ట్రా, కాప్టివా ఎస్‌యూవిల ధరల జోలికి మాత్రం జనరల్ మోటార్స్ వెళ్లలేదు. వీటి ధరలను మార్చకుండా యధాతధంగా ఉంచామని కంపెనీ పేర్కొంది.

మార్కెట్ మందగమనం, నానాటికీ పెరుగుతున్న ఉత్పాదక వ్యయం, ఆందోళన కలిగిస్తున్న రూపాయి మారకపు విలువ వంటి కారణాల వల్ల ధరలు పెంచాల్సి వస్తుందని జనరల్ మోటార్స్ ఉపాధ్యక్షుడు పి బాలేంద్రన్ తెలిపారు. కాగా.. ఇప్పటికే మారుతి సుజుకి కూడా, స్విఫ్ట్ డిజైర్ సెడాన్ మినహా మిగిలిన అన్ని ఉత్పత్తుల ధరలను సుమారు రూ.17,000 లకు పైగా పెంచిన సంగతి తెలిసిందే.

More from DriveSpark

Article Published On: Wednesday, January 18, 2012, 10:50 [IST]
English summary
General Motors India has increased the product prices by between 0.5 per cent and 1.75 per cent for models including the Spark, Beat, Cruze and Tavera, translating into an increase ranging from Rs 3,000 to Rs 15,000.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+