మాంజాలో సస్పెన్షన్ పార్ట్‌ను రీప్లేస్ చేయనున్న టాటా మోటార్స్
చౌక ధరలో ప్రీమియం అనుభూతిని కల్పించే టాటా మాంజా సెడాన్‌లోని సస్పెన్షన్ వ్యవస్థలోని యాంటీ-రోల్ బార్ బుష్‌ను రీప్లేస్ చేయనున్నట్లు టాటా మోటార్స్ పేర్కొంది. ప్రస్తుతం మాంజా కార్లలో ఉన్న యాంటీ-రోల్ బార్ బుష్ మెరుగైన, ధృడమైన యాంటీ-రోల్ బార్ బుష్‌ను అమర్చేందుకు రీప్లేస్‌మెంట్ ఎక్సర్‌సైజ్‌లో భాగంగా ఈ కార్లను వెనక్కు పిలుస్తున్నట్ల టాటా పేర్కొంది.
గడచిన 2009లో మాంజా కారును టాటా మోటార్స్ దేశీయ విపణిలోకి విడుదల చేసింది. ఇప్పటి వరకూ ఇండియాలో విక్రయించిన కార్లన్నింటిలోనీ ఈ యాంటీ-రోల్ బార్ బుష్‌ను ఉచితంగా టాటా మోటార్స్ అధీకృత సర్వీస్ సెంటర్లలో రీప్లేస్ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. వాహనం చలనంలో ఉన్నప్పుడు ఫ్రిక్షన్‌ను అడ్డుకొని, వాహనానికి స్టెబిలిటీను కల్పించడంలో యాంటీ-రోల్ బార్ బుష్ సహకరిస్తుంది.
టాటా మాంజా సెడాన్ విషయానికి వస్తే.. ఇంటీరియర్ స్పేస్‌లో బెస్ట్ ఇన్ క్లాస్ అయిన ఈ మోడల్ విశిష్టమైన లుక్‌ను, విలాసవంతమైన ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇది పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్లలో లభిస్తుంది. పెట్రోల్ వేరియంట్ మాంజాలో ఉపయోగించిన 1.4 లీటర్ ఇంజన్ 90 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని, 116 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది.
అలాగే, డీజిల్ వేరియంట్ మాంజాలో ఉపయోగించిన 1.3 లీటర్ మల్టీజెట్ ఇంజన్ 90 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని, 200 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. టాటా మాంజా ధరలు రూ.5.63 లక్షల నుండి రూ.7.96 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.


Click it and Unblock the Notifications









