అఫీషియల్: అక్టోబర్ 25న కొత్త చెవర్లే స్పార్క్ విడుదల
జనరల్ మోటార్స్ ఇండియా నుంచి అప్పుడా ఇప్పుడా అని ఎదురుచూస్తున్న సరికొత్త చిన్న కారు చెవర్లే స్పార్క్ విడుదలకు ముహుర్తం ఖరారైంది. అప్‌గ్రేడెడ్ చెవర్లే స్పార్క్‌ను కంపెనీ ఈనెల 25న మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో చెవర్లే ఇప్పటికే తమ అధికారిక వెబ్‌సైట్‌లో కొత్త స్పార్క్ కోసం ఓ టీజర్‌ను కూడా విడుదల చేసింది. సరికొత్త ఫ్రంట్ గ్రిల్, కొత్త హెడ్‌ల్యాంప్స్, రీడిజైన్ చేయబడిన ఫాగ్‌ల్యాంప్స్, పెద్ద ఎయిర్‌డ్యామ్, డ్యూయెల్ టోన్ ఫినిష్‌తో కూడిన కొత్త ఫ్రంట్ అండ్ రియర్ బంపర్స్, డ్యూయెల్ టోన్ ఇంటీరియర్స్, విశాలమైన క్యాబిన్ స్పేస్, పక్షి రెక్కల నుంచి స్ఫూర్తి పొంది డిజైన్ చేసిన ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి మార్పులు ప్రధానంగా చెప్పుకోదగినవి.

అంతేకాకుండా, కొత్త స్పార్క్ ఫ్రంట్ బంపర్‌పై అమర్చిన మరింత ఆకర్షనీయమైన లోగో, రియర్ వ్యూ మిర్రర్స్‌పై ఏర్పాటు చేసిన టర్న్ ఇండికేటర్స్‌ను కూడా మనం పరిశీలించవచ్చు. బెంగుళూరులో ఉన్న చెవర్లే సాంకేతి విభాగం ఈ డిజైన్ మార్పులను చేపట్టింది. కొత్త చెవర్లే ఈ సెగ్మెంట్లోకి లేటెస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన కొత్త మారుతి సుజుకి ఆల్టో 800, హ్యుందాయ్ ఇయాన్, టాటా నానో (టాప్-ఎండ్ వేరియంట్) వంటి చిన్న కార్లకు పోటీగా నిలువనుంది. చెవర్లే స్పార్క్ గడటిన ఐదేళ్ల క్రితం భారత మార్కెట్లోకి ప్రవేశించింది. ప్రస్తుతం భారీగా పెరిగిన పెట్రోల్ ధరల కారణంగా ఈ మోడల్ అమ్మకాలు ఆశించిన రీతిలో సాగటం లేదు.
ఈ నేపథ్యంలో మరింత మెరుగైన మైలేజీనిచ్చేలా కంపెనీ కొత్త స్పార్క్‌ను అభివృద్ధి చేసినట్లు సమాచారం. సరికొత్త లుక్ అండ్ ఫీల్‌నిచ్చే డిజైన్, రిఫ్రెష్డ్ ఇంటీరియర్స్, రీట్యూన్ చేయబడిన ఇంజన్ వంటి ప్రధాన మార్పులతో కొత్త చెవర్లే స్పార్క్ మార్కెట్లోకి రానుంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న స్పార్క్‌లో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది పెట్రోల్, ఎల్‌పిజి వెర్షన్లలో లభ్యమవుతోంది. అయితే, ప్రస్తుతం సిఎన్‌జి వెర్షన్ స్మాల్ కార్స్‌కు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కొత్తగా రానున్న చెవర్లే స్పార్క్‌లో సిఎన్‌జి వేరియంట్ కూడా మార్కెట్లోకి రావచ్చని తెలుస్తోంది. భారత మార్కెట్లో ప్రస్తుత వెర్షన్ చెవర్లే స్పార్క్ ధర రూ.3.15 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. కొత్త చెవర్లే స్పార్క్ కూడా ఇంచు మించు ఇదే ధరను కలిగి ఉండొచ్చని అంచనా.


Click it and Unblock the Notifications








