అక్టోబర్ నెలలో మార్కెట్లోకి రానున్న కొత్త చెవర్లే స్పార్క్

By Ravi

అమెరికన్ ఆటో దిగ్గజం జనరల్ మోటార్స్‌కు భారత మార్కెట్లో చెవర్లే బ్రాండ్‌తో అందిస్తున్న ఎంట్రీ లెవల్ స్మాల్ కారు 'చెవర్లే స్పార్క్'లో మరింత మెరుగైన వేరియంట్ వచ్చే నెలలో మార్కెట్లోకి రానుంది. మారుతున్న మార్కెట్ పరిస్థితులు, వినియోగదారుల అభిరుచులను దృష్టిలో ఉంచుకొని ఇదివరకటి చెవర్లే స్పార్క్ కన్నా ఎన్నో రెట్లు మెరుగ్గా ఉండేలా తీర్చిదిద్దిన సరికొత్త అప్‌డెటెడ్ వెర్షన్‌ను అక్టోబర్ నెలలో మార్కెట్లో విడుదల చేయనున్న కంపెనీ అధికారి ఒకరు తెలిపారు.

మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, కొత్త మారుతి సుజుకి ఆల్టో 800 విడుదలకు ఒక్క రోజు ముందు సరికొత్త చెవర్లే స్పార్క్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఐదేళ్ల క్రితం చెవర్లే స్పార్క్ దేశీయ మార్కెట్లో విడుదలైంది. ఇది కేవలం పెట్రోల్ వేరియంట్‌లో మాత్రమే లభ్యమవుతోంది. అయితే, ప్రస్తుతం పెట్రోల్ ధరలు భారీగా పెరగటం, మరింత మెరుగైన మైలేజీనిచ్చే స్పార్క్‌ను కొనుగోలుదారులకు అందించాలనే ఉద్దేశ్యంతో జనరల్ మోటార్స్ ఈ కొత్త వెర్షన్‌ను అభివృద్ధి చేసింది.

సరికొత్త లుక్ అండ్ ఫీల్‌నిచ్చే డిజైన్, రిఫ్రెష్డ్ ఇంటీరియర్స్, రీట్యూన్ చేయబడిన ఇంజన్ వంటి ప్రధాన మార్పులతో కొత్త చెవర్లే స్పార్క్ మార్కెట్లోకి రానుంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న స్పార్క్‌లో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు. కొత్త స్పార్క్‌లో కూడా ఇదే ఇంజన్‌ను రీట్యూన్ చేసి ఉపయోగిస్తారా లేదా ఎక్కువ మైలేజ్ కోసం తక్కువ సీసీ కలిగిన (800సీసీ) ఇంజన్‌ను ఉపయోగిస్తారా అనే విషయం తేలాల్సి ఉంది.

చెవర్లే స్పార్క్‌లో అప్‌డేటెడ్ వెర్షన్ ఇప్పటికే అమెరికన్ మార్కెట్లో చెవర్లే బీట్ పేరుతో అమ్ముడవుతోంది. గడచిన జవరిలో జరిగిన ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో జనరల్ మోటార్స్ ప్రదర్శించిన ఎలక్ట్రిక్ చెవర్లే స్పార్క్ కాన్సెప్ట్ (ఈ-స్పార్క్) డిజైన్‌ను నుంచి స్ఫూర్తి పొంది కొత్త స్పార్క్‌ను డిజైన్ చేసే అవకాశం ఉంది. చెవర్లే స్పార్క్ చిన్న కారు అయినప్పటికీ, విశాలమైన ఇంటీరియర్ స్పేస్, మంచి డ్రైవింగ్ అండ్ హ్యాండ్లింగ్‌ను కలిగి ఉండి, చిన్న కారు ప్రియులకు చక్కగా సరిపోతుంది. చెవర్లే స్పార్క్‌లో సిఎన్‌జి వేరియంట్ కూడా మార్కెట్లోకి రావచ్చని సమాచారం.

More from DriveSpark

Article Published On: Friday, September 28, 2012, 10:39 [IST]
English summary
General Motors will join the list of carmakers launching new cars and updates during this year's festive season. Reports say a facelifted Spark will be launched on October 15 just a day before the launch of the new Maruti Suzuki Alto 800.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+