చెవర్లే ట్రైల్‌బ్లేజర్ ఎస్‌యూవీని ప్రవేశపెట్టనున్న జిఎమ్!

Chevrolet Trailblazer SUV 2012
అమెరికాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ జనరల్ మోటార్స్ ఇండియా దేశీయ విపణిలో మరో ఎస్‌యూవీని ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం జనరల్ మోటార్స్ భారత మార్కెట్లో చెవర్లే బ్రాండ్‌లో అందిస్తున్న కాప్టివా ఎస్‌యూవీకు దిగువన మరో ఎస్‌యూవీని విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

గ్లోబల్ మార్కెట్లో జనరల్ మోటార్స్‌కు ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా ఉన్న 'చెవర్లే ట్రైల్‌బ్లేజర్' ఎస్‌యూవీని ఇండియన్ మార్కెట్లో కూడా విడుదల చేసేందుకు గల సాధ్యాసాధ్యాలను జనరల్ మోటార్స్ పరిశీలిస్తోంది. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన 2012 ఆటో ఎక్స్‌పోలో సరికొత్త 2012 కాప్టివా ఎస్‌యూవీని జనరల్ మోటార్స్ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.

త్వరలోనే ఈ మోడల్ మార్కెట్లో వాణిజ్య పరంగా లభ్యం కానుంది. సరసమైన ధరకే ఈ మోడల్‌ను అందించాలనే ఉద్దేశ్యంతో జనరల్ మోటార్స్ ఈ ఎస్‌యూవీని విడిభాగాలుగా దిగుమతి చేసుకొని ఇక్కడే అసెంబ్లింగ్ చేయనుంది. ఈ తరహాలోనే 2012 చెవర్లే ట్రైల్‌బ్లేజర్ ఎస్‌యూవీని కూడా అందించాలని కంపెనీ సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

కొత్త 2012 ట్రైల్‌బ్లేజర్ ఎస్‌యూవీ 2.8 లీటర్ డ్యురామ్యాక్స్ డీజిల్ ఇంజన్‌ను కలిగి ఉండి 180 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని, 480 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో కూడా లభించే అవకాశం ఉంది. ఇందులో ఏడుగురు ప్రయాణికులు హాయిగా ప్రయాణించవచ్చు. దీని ధర రూ.17 లక్షలకు దిగువన ఉండొచ్చని అంచనా. కాగా.. ఈ విషయాన్ని జనరల్ మోటార్స్ ఇండియా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.

More from DriveSpark

Article Published On: Monday, January 30, 2012, 12:05 [IST]
English summary
It is speculated that, General motors India may launch the 2012 Chevrolet Trialblazer SUV in India. The 2012 Trailblazer comes with a 2.8 Liter Duramax diesel engine outputting 180 Bhp of peak power and 480 Nm of peak torque.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+