పండుగ సీజన్ వరకూ జిఎమ్ ఉత్పత్తి కోత కొనసాగింపు

ఇటీవలే తాజాగా రెండు కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేసిన అమెరికాకు చెందిన ఆటో దిగ్గజం జనరల్ మోటార్స్ (జిమ్) ఉత్పత్తి కోతను కొనసాగించనున్నట్లు పేర్కొంది. అంతేకాకుండా, రానున్న పండుగ సీజన్ వరకూ వారానికి ఒక్క రోజు చొప్పును ప్లాంటుకు సెలవు ప్రకటించనున్నట్లు కూడా జిఎమ్ ప్రకటించింది.

"ఇది (ప్రతి వారంలో ఒక్క రోజు చొప్పున ఉత్పత్తిని నిలిపివేయటం) పండుగ సీజన్ వరకూ (దాదాపు అక్టోబర్ వరకూ) కొనసాగుతుంద"ని జనరల్ మోటార్స్ ఇండియా ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ లోవెల్ పడ్డాక్ తెలిపారు. డిమాండ్‌కు అనుగుణంగా మహారాష్ట్రలోని తాలేగావ్, గుజరాత్‌లోని హలోల్ ప్లాంట్‌లో ఉత్పత్తిని చేపడుతున్నామని, అనవసరంగా ఉత్పత్తుల స్టాక్ పెరిగిపోకుండా ఉండేందుకు వారంలో ఒక్క రోజు ఉత్పత్తిని నిలిపివేస్తున్నామని జనరల్ మోటార్స్ వెల్లడించింది.


ఇతర కార్ తయారీ కంపెనీల మాదిరిగా ప్లాంట్‌లను పూర్తిగా మూసివేయడానికి బదులు ఉత్పత్తి లేని రోజుల (నో-ప్రొడక్షన్ డే)లను కొనసాగిస్తున్నామని, ఇన్వెంటరీ పెరిగిపోకుండా ఉండేందుకు ఇది తోడ్పడుతుందని జనరల్ మోటార్స్ వైస్ ప్రెసిడెంట్ ఆర్ బాలేంద్రన్ తెలిపారు. తాలేగావ్ ప్లాంట్‌లో ఏటా 1.4 లక్షల వాహనాలు ఉత్పత్తి అవుతుండగా, హలోల్ ప్లాంటులో సాలీనా 85,000 వాహనాలు ఉత్పత్తి అవుతున్నాయి.

ఆటోమొబైల్ మార్కెట్లో ప్రస్తుతం నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు మరికొంత కాలం ఇలానే కొనసాగే ఆస్కారం ఉందని జనరల్ మోటార్స్ భావిస్తోంది. ఇది ఇలానే కొనసాగితే రానున్న పండుగ సీజన్‌లో కూడా అమ్మకాలు పెద్దగా జరిగే అవకాశం లేదని ఆయన చెప్పారు.

More from DriveSpark

Article Published On: Tuesday, July 3, 2012, 9:54 [IST]
English summary
US auto major General Motors India has said that it would continue to curtail its production and take a day off every week till the festival season.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+