విడుదలకు ముస్తాబవుతున్న చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి

చెవర్లే నుంచి వేయి కళ్లతో ఎదురుచూస్తున్న బహుళ ప్రయోజన వాహనం (ఎమ్‌పివి) 'చెవర్లే ఎంజాయ్' విడుదలకు ముస్తాబవుతోంది. గడచిన జనవరిలో జరిగిన ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో తొలిగా ఆవిష్కరించబడి, కార్ ప్రియులను కట్టిపడేసిన చెవర్లే ఎంజాయ్ అతి త్వరలోనే మార్కెట్లో విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే పోటీతో రాజుకుంటున్న ఎమ్‌పివి సెగ్మెంట్లో మరింత వేడిని పుట్టించేందుకు చెవర్లే ఎంజాయ్ సిద్ధమవుతోంది.

టొయోటా ఇన్నోవా, మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్‌పివిలను సవాల్ చేస్తూ చైనా భాగస్వామి షాంగై ఆటోమోటివ్ ఇండస్ట్రీ కంపెనీ (ఎస్ఏఐసి)తో కలిసి అమెరికా ఆటో దిగ్గజం జనరల్ మోటార్స్‌ అభివృద్ధి చేసిన ఎమ్‌పివి చెవర్లే ఎంజాయ్‌ను కంపెనీ ప్రస్తుతం ఇండియన్ రోడ్లపై టెస్టింగ్ నిర్వహిస్తోంది. చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివిని జనరల్ మోటార్స్‌కు గుజరాత్‌లో ఉన్న తమ హలోల్ ప్లాంటులో ఉత్పత్తి చేయనుంది. ఇప్పటికే టెస్ట్ వెహికల్‌ను కంపెనీ గుజరాత్‌లో టెస్ట్ చేస్తుంది.


దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తున్నాయి. చైనా టైఅప్ నుండి వస్తున్న తొలి ఉత్పత్తి చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి అని జనరల్ మోటార్స్ ఇండియా ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ లోవెల్ సి పడ్డాక్ గతంలో వివరించారు. ఈ ఏడాది పండుగ సీజన్ నాటికి చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి వాణిజ్య పరంగా మార్కెట్లో లభ్యం కావచ్చని అంచనా.

Chevrolet Enjoy MPV Phot Gallery:

ప్రస్తుతం చైనీస్ మార్కెట్లో జనరల్ మోటార్స్ ఇదే పేరుతో చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివిని అందిస్తోంది. చైనా భాగస్వామ్యంతో దీనిని తయారు చేస్తున్నందున భారత మార్కెట్లో దీని ధర చాలా తక్కువగా ఉండే అకకాశాలు కనిపిస్తున్నాయి. మార్కెట్ అంచనాల ప్రకారం దీని ధర సుమారు రూ.6 లక్షల నుంచి ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. అంటే నేరుగా మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్‌పివికు ఇది పోటీగా రానుందన్నమాట.

చెవర్లే ఎంజాయ్ ఇటు పెట్రోల్ అటు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. 1.4 లీటర్ పెట్రోల్, 1.3 లీటర్ ఎస్‌డిఈ డీజిల్ ఇంజన్‌లను చెవర్లే ఎంజాయ్‌లో ఉపయోగించనున్నట్లు సమాచారం. ఇదే కాకుండా మరో మూడు ఉత్పత్తులను జనరల్ మోటార్స్ ఈ ఏడాది మార్కెట్ పరిచయం చేయనుంది. అందులో అప్‌గ్రేడెడ్ చెవర్లే స్పార్క్, చెవర్లే సెయిల్ హ్యాచ్‌బ్యాక్, చెవర్లే సెయిల్ సెడాన్‌లను ఈ ఏడాదిని చివరి నాటికి కంపెనీ మార్కెట్లో విడుదల చేయనుంది.

More from DriveSpark

Article Published On: Thursday, July 5, 2012, 16:40 [IST]
English summary
American car maker General Motors will launch its new MPV Chevrolet Enjoy in India by the end of 2012 which is expected to be priced at a price tag of Rs 6 lakh. Presently company is testing the Chevrolet Enjoy in Indian roads.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+