తిరుపతికి విచ్చేసిన గోల్డ్ ప్లస్ 'గోల్డెన్ టాటా నానో'

Gold Nano
భారతదేశంలో స్వర్ణాభరణాల తయారీ మొదలై 5,000 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వర్ణకారుల జ్ఞాపకార్థం టాటా గ్రూపుకు చెందిన స్వర్ణాభరణాల విభాగం టాటా గోల్డ్ ప్లస్ మరియు ఆటోమొబైల్ విభాగం టాటా మోటార్స్‌లు సంయుక్తంగా రూపొందించిన బంగారు నానో కారు శ్రీవారి సన్నిధికి చేరుకుంది.

తిరుపతిలోని ఎయిర్‌బైపాస్ రోడ్డులో ఉన్న పీఎల్‌ఆర్ కన్వెన్షన్ హాల్‌లోని గోల్డ్‌ప్లస్ జ్యువెలరీ షోరూమ్‌లో ఈ గోల్డ్ నానో కారును ప్రదర్శనకు ఉంచారు. భారతదేశంలో ఒక్కోప్రాంతాని సంబంధించిన ఒక్కొక్క డిజైన్‌ను ఈ గోల్డ్ నానోపై చూడవచ్చు. టాటా గోల్డ్ ప్లస్ కంపెనీ ప్రచారంలో భాగంగా ఈ బంగారు నానో కారును దేశవ్యాప్తంగా ఉన్న అన్ని గోల్డ్ ప్లస్ అవుట్‌లెట్లలో ప్రదర్శించనుంది.

ఇందులో భాగంగానే కంపెనీ తమ బంగారు నానో కారును చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో కూడా ప్రదర్శనకు ఉంచింది. దీని తయారీ కోసం 80 కేజీల స్వచ్ఛమైన బంగారాన్ని, 15 కేజీల వెండిని మరియు 10,000 రత్నాలను ఉపయోగించారు. ఈ బంగారు నానో కారు తయారీకి కంపెనీ సుమారు రూ.22 కోట్లకు పైగా ఖర్చు చేసింది.

More from DriveSpark

Article Published On: Thursday, January 12, 2012, 11:40 [IST]
English summary
India's cheapest car is all set to possibly the most expensive too. A Tata Nano that has been built using gold, silver and several precious stones was displayed in Tirupati, AP as a part of Gold Plus campgine.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+