గూగుల్ ఇండియాలో అత్యధికంగా శోధించిన కొత్త కార్లు
మనకు ఇంటర్నెట్లో ఏ చిన్న విషయం గురించి సమాచారం కావాలన్న గూగుల్ సెర్చ్ పైనే ఎక్కువగా ఆధారపడుతుంటాం. అలాగే, కొత్త కార్ల గురించి సమాచారం కావాలన్నా కూడా ముందుగా గూగుల్ చేసిన తర్వాతనే ఇతర వెబ్‌సైట్‌లను పరిశీలించటం జరుగుతుంది. ఈ నేపథ్యంలో, ఇండియాలో ఇటీవల విడుదలైన కొత్త కార్ల గురించి వినియోగదారులు చేసిన రీసెర్చ్ గురించి గూగుల్‌తో కలిసి ఏసి నీల్సన్ నిర్వహించిన ఓ సర్వేలో గూగుల్ ఇండియాలో అత్యధికంగా శోధించిన కొత్త కార్ల గురించిన ఓ జాబిజాను గూగుల్ విడుదల చేసింది.
ఈ జాబితా పరిశీలిస్తే. 2011 సంవత్సరంలో విడుదలైన అత్యంత పాపులర్ కార్లు ఏంటో ఇట్టే అర్థమైపోతుంది. గూగుల్ విడుదల చేసిన ఈ రిపోర్ట్ ప్రకారం, ఆన్‌లైన్‌లో ఎస్‌యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాల) గురించి శోధించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇందుక ప్రధానం కారణం ఒకప్పుడు ప్రీమియం/లగ్జరీ వాహనాలుగా ఉన్న ఎస్‌యూవీలు ఇప్పుడు మార్కెట్లో పోటీ పెరగిన కారణంగా సరమైన ధరలకే లభిస్తుండటమే. ఎస్‌యూవీల తర్వాత అత్యధికంగా శోధించబడినవి ప్రీమియం కార్లు.
కాగా.. తృతీయ స్థానంలో సెడాన్లు నిలువగా, నాల్గవ స్థానంలో లగ్జరీ కార్లు, ఐదవ స్థానంలో హ్యాచ్‌బ్యాక్‌లు ఉన్నట్లు గూగుల్ ఇండియా తెలిపింది. గూగుల్ ఇండియాలో శోధించిన కార్ల జాబితాలో మోడల్ వారీగా పరిశీలిస్తే.. టాప్ టెన్ స్థానాల్లో నిలిచిన కార్ల వివరాలు ఇలా ఉన్నాయి:
1. హ్యుందాయ్ ఇయాన్
2. మహీంద్రా ఎక్స్‌యూవీ500
3. హోండా బ్రయో
4. టాటా మాంజా
5. మారుతి సుజుకి కిజాషి
6. టొయోటా ఎతియోస్ లివా
7. హ్యుందాయ్ ఫ్లూయిడిక్ వెర్నా
8. నిస్సాన్ సన్నీ
9. స్కొడా ర్యాపిడ్
10. ఫోర్డ్ ఫియస్టా


Click it and Unblock the Notifications








