డీజిల్ కార్లపై ఎక్సైజ్ సుంకం పెంచేందుకు సర్కారు సన్నాహాలు
ఈ నేపథ్యంలో, సబ్సిడి ధరకే విక్రయిస్తున్న డీజిల్ ఇంధన ధరలను పెంచడానికి బదులుగా, డీజిల్ కార్లపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తే వాటి వినియోగం తగ్గి ఫలితంగా డీజిల్ వినియోగం తగ్గుతుందనే సర్కారు భావన. అంతేకాకుండా.. ఈ సబ్సిడి విక్రయం కారణంగా ప్రభుత్వ ఖజానాపై అధిక భారం పడుతోంది. ఈ భారాన్ని తప్పించుకునేందుకు గానూ డీజిల్ కార్లపై ఎక్సైజ్ సుంకం పెంచితే సరిపోతుందని కేంద్ర చమురు శాఖ, కేంద్ర ఆర్థిక శాఖకు సూచింది.
ప్రస్తుతం ఈ సూచనపై పరిశీలన జరుపుతున్నామని, ఇది భవిష్యత్తులో అమలు కావచ్చని ఆర్థిక శాఖ అధికార వర్గాలు అంటున్నాయి. అయితే, డీజిల్ కార్లపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచడాన్ని భారీ పరిశ్రమల శాఖ వ్యతిరేకిస్తోంది. ఇదే గనుక అమల్లోకి వస్తే.. కొనుగోలుదారులు డీజిల్ కార్లపై అదనంగా రూ.80,000 లకు పైగా చెల్లించాల్సి వస్తుంది. ప్రస్తుతం చమురు మార్కెటింగ్ కంపెనీలు లీటర్ డీజిల్‌ను రూ.15.35 నష్టానికి విక్రయిస్తున్నాయి.


Click it and Unblock the Notifications









