30 లక్షల లైట్ డీజిల్ ఇంజన్లను ఉత్పత్తి చేసిన గ్రీవ్స్ కాటన్
భారతదేశపు ప్రముఖ ఇంజనీరింగ్ కంపెనీలలో ఒకటైన గ్రీవ్స్ కాటన్ లిమిటెడ్ తన ఖాతాలో మరో అరుదైన రికార్డును నమోదు చేసుకుంది. ఇండియాలో 30 లక్షల లైట్ డీజిల్ ఇంజన్లు తయారు చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఫిబ్రవరి 17, 2012న కంపెనీ ఈ ఘనతను సాధించింది. ఔరంగాబాద్‌లోని ప్లాంటులో 30 లక్షవ ఇంజన్‌ను కంపెనీ ఎమ్‌డి, సీఈఓ సునీల్ పౌల్ విడుదల చేశారు.
డిసెంబర్ 2004లో గ్రీవ్స్ కాటన్ 10 లక్షల లైట్ డీజిల్ ఇంజన్ మార్కును అధిగమించగా ఆ తర్వా కేవలం నాలుగున్న సంవత్సరాల కాలంలోనే 20 లక్షల లైట్ డీజిల్ ఇంజన్ మార్కును సాధించింది. ప్రస్తుతం మూడేళ్ల కన్నా తక్కువ సమయంలో 20 లక్షల లైట్ డీజిల్ ఇంజన్ మార్కును అధిగమించామని కంపెనీ పేర్కొంది. కంపెనీ చరిత్రలో ఇదే అత్యంత వేగమైన వృద్ధి.
పియాజ్జియో, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, అతుల్ ఆటో వంటి ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలకు గ్రీవ్స్ కాటన్ తమ ఇంజన్లను సరఫరా చేస్తుంది. ఆటో రిక్షాలు, ప్యాసింజర్ క్యాబ్‌లు, చిన్న తరహా వాణిజ్య వాహనాల్లో ఈ ఇంజన్లు ఉపయోగిస్తారు.


Click it and Unblock the Notifications









