మారుతి అల్లర్లు: ప్లాన్ ప్రకారమే అవనిష్ కుమార్ హత్య

మారుతి సుజుకి మానేసర్ అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన కంపెనీ జనరల్ మేనేజర్ (హెచ్ఆర్) అవనిష్ కుమార్ దేవ్ (49 ఏళ్లు)ను కార్మికులు అతి క్రూరంగా చంపినట్లు పోస్ట్‌మార్టమ్ నివేదికలో వెల్లడైంది. కోపోద్రిక్తులైన కార్మికులు ప్రత్యేకించి అవనిష్‌ను టార్గెట్ చేసి, ఇనుపరాడ్లతో రెండు కాళ్లను విరగొట్టి, అతని శరీనానికి నిప్పంటించినట్లుగా ఫోరెన్సిక్ నివేదిక వెల్లడిస్తోంది. మారుతి సుజుకి కంపెనీలో నిజాయితీగా నిబంధనలకు కట్టుబడి పనిచేయటమే అతని చావుకు కారణమైంది.

మారుతి సుజుకి అందించిన సమాచారం ప్రకారం, జావియర్ ఇన్సిట్యూట్ ఆఫ్ సోషల్ సర్వీసెస్ నుంచి ఎమ్‌బిఏ చేసిన అవనిష్ కుమార్ గడచిన 9 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. అతను ఎల్లప్పుడూ తన ఉద్యోగ విధి నిర్వహణలో అవుట్‌స్టాండిగ్ ప్రతిభను కనబరిచేవాడని, పారిశ్రామిక నిబంధనలకు కట్టుబడి పనిచేసేవాడని కంపెనీ పేర్కొంది. అవనిష్ కుమార్‌ భార్య సపర్నా దేవ్ కేంద్ర రక్షణ శాఖలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఇతని ఏ 10 ఏళ్ల కుమారుడు (అభియుదీప్) కూడా ఉన్నాడు.

అవనిష్ కుమార్ మరణవార్త వినగానే అతని కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. పోస్ట్‌మార్టమ్ నివేదిక ప్రకారం, అవనిష్ ఊపిరి ఆడక, 100 శాతం కాలిన గాయాలతో, శరీరం గుర్తు పట్టలేని స్థితిలో మరణించాడు. అంతేకాకుండా, రెండు కాళ్ల ఎముకలు అక్కడక్కడా విరిగినట్లు కూడా ఫోరెన్సిక్ నిపుణులు గుర్తించటం జరిగింది.

More from DriveSpark

Article Published On: Friday, July 20, 2012, 14:41 [IST]
English summary
The death of Maruti Suzuki's GM of HR at Manesar plant has raised suspisions. Preliminary reports say he was beaten up and then his office was set fire. His body was found with 100% burns.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+