మార్చి నెలలో 2 శాతం పెరిగిన హీరో మోటోకార్ప్ అమ్మకాలు
ఇటీవలే మాస్ట్రో స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చిన దేశపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్ (గతంలో హీరో హోండా) దేశీయ విపణిలో అమ్మకాల పరంగా అదరగొడుతుంది. గడచిన మార్చి నెలలో హీరో మోటోకార్ప్ అమ్మకాలు ఐదు లక్షల యూనిట్ల మార్కును అధిగమించాయి. హీరో తాజా విడుదల చేసిన మాస్ట్రో స్కూటర్‌తో ఈ అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా.
మార్చి 2012లో హీరో మోటోకార్ప్ 5,28,290 యూనిట్లను విక్రయించి, మార్చి 2011 అమ్మకాలతో పోలిస్తే (5,15,852 యూనిట్లు)తో 2.41 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. అంతేకాకుండా మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంతో హీరో మోటోకార్ప్ తన మొత్తం ద్విచక్ర వాహన అమ్మకాల సంఖ్యను 60 లక్షల యూనిట్లకు పెంచుకుని, అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది.
ఇదివరకటి ఆర్థిక సంవత్సరం (2010-11)లో హీరో మోటోకార్ప్ మొత్తం 54,02,444 ద్విచక్ర వాహనాలను విక్రయించింది. గడచిన ఆర్థిక సంవత్సరం తమకు మర్చిపోలేదని హీరో మోటోకార్ప్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ పవన్ ముంజాల్ తెలిపారు. 26 ఏళ్ల పాటు భాగస్వామిగా ఉన్న జపాన్ ఆటో దిగ్గజం హోండా నుండి విడిపోయిన తర్వాత కూడా హీరో మోటోకార్ప్ ఏ మాత్రం తొణకుండా, మరింత వృద్ధి చెందుతూ ముందుకు సాగిపోతుండటం విశేషం.


Click it and Unblock the Notifications









