ఆగస్టులో డీలా పడిన ద్విచక్ర వాహన కంపెనీలు
ఆగస్టు 2011తో పోల్చుకుంటే ఆగస్టు 2012 నెలలో హీరో మోటోకార్ప్ అమ్మకాలు ఏకంగా 11.88 శాతం క్షీణించి 5,03,654 యూనిట్ల నుంచి 4,43,801 యూనిట్లకు పడిపోయాయి. మార్కెట్ సెంటిమెంట్ బలహీనంగా ఉండటం వలనే అమ్మకాలు క్షీణించాయని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) అనిల్ దువా వ్యాఖ్యానించారు.
చెన్నైకు చెందిన ద్విచక్ర వాహన కంపెనీ టీవీఎస్ మోటార్ కంపెనీ కూడా ఆగస్ట్ నెల అమ్మకాలలో భారీ తగ్గుదలను నమోదు చేసుకుంది. గడచిన సంవత్సరం ఆగస్ట్ నెలతో పోల్చుకుంటే ఈ ఆగస్టు నెలలో టీవీఎస్ మొత్తం అమ్మకాలు 20.6 శాతం క్షీణించి 1,94,898 యూనిట్ల నుంచి 1,54,647 యూనిట్లకు పడిపోయాయి. కాగా.. ద్విచక్ర వాహనాల అమ్మకాలు (మోటార్‌సైకిళ్లు, స్కూటర్లు కలిపి) 1,90,184 యూనిట్ల నుంచి 1,50,740 యూనిట్లకు పడిపోయాయి.
ఇదే సమయంలో జపాన్‌కు చెందిన ద్విచక్ర వాహన కంపెనీ సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా మాత్రం గడచిన నెలలో ప్రోత్సాహకర అమ్మకాలను నమోదు చేసింది. ఆగస్టు 2011తో పోల్చుకుంటే ఆగస్టు 2012లో కంపెనీ అమ్మకాలు 36 శాతం వృద్ధి చెంది 26,900 యూనిట్ల నుంచి 36,524 యూనిట్లకు పెరిగనట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.


Click it and Unblock the Notifications









