త్వరలో కాంపాక్ట్ అంబాసిడర్ కారును ప్రవేశపెట్టనున్న హెచ్ఎమ్

భారత ఆటోమొబైల్ మార్కెట్లో సరికొత్త విప్లవాలకు నాంది పలికిన దేశపు అత్యంత పురాతన ఆటోమొబైల్ సంస్థ హిందూస్థాన్ మోటార్స్ (హెచ్ఎమ్) తాజాగా మరో సంచలనాన్ని పరిచయం చేయనుంది. హెచ్ఎమ్ నుండి అత్యంత పాపులర్ అయిన అంబాసిడర్ సెడాన్‌లో ఓ చిన్న కారును దేశీయ కొనుగోలుదారులకు పరిచయం చేసేందుకు హిందూస్థాన్ మోటార్స్ సన్నాహాలు చేస్తుంది.

హిందూస్థాన్ మోటార్స్ నుండి మార్కెట్లోకి రానున్న ఈ కాంపాక్ట్ అంబాసిడర్ సెడాన్ కూడా, తాజాగా మారుతి సుజుకి నుండి మార్కెట్లోకి విడుదలైన కాంపాక్ట్ స్విఫ్ట్ డిజైర్ మాదిరిగానే పొడవులో 4 మీటర్ల కన్నా తక్కువగా ఉండనుంది. చిన్న కార్లపై ప్రభుక్వం విధించే ఎక్సైజ్ సుంకంలో రాయితీలను పొందేందుకు గానూ హిందూస్థాన్ మోటార్స్ ఈ బుజ్జి అంబాసిడర్ కారును రూపొందిస్తోంది.

అయితే, కేవలం పొడవు తక్కువగా ఉన్నంత మాత్రనా అలాంటి కార్లను చిన్నకార్లుగా పరిగణించిలో వాటిల్లో ఉపయోగించే ఇంజన్ సామర్థ్యం కూడా చిన్న కార్లపై ప్రభావితం చూపుతుంది. కాబట్టి కాంపాక్ట్ అంబాసిడర్ కారులో ఉపయోగిస్తున్న 18 లీటర్ ఇసుజు పెట్రోల్ లేదా సిఎన్‌జీ ఇంజన్ స్థానంలో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ లేదా 1.5 లీటర్ డీజిల్ ఇంజన్‌లను రీప్లేస్ చేసే ఆస్కారం ఉంది.

ఏదేమైనప్పటికీ, 2012లో హిందూస్థాన్ మోటార్స్ నుండి ఇదే (కాంపాక్ట్ అంబాసిడర్ సెడాన్ విడుదల) అతిపెద్ద విడుదలయ్యే చాన్స్ ఉంది. గడచిన సంవత్సరం ఆగస్ట్ నెలలో అంబాసిడర్ ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందించిన తేలికపాటి వాణిజ్య వాహనం "వీర్"ను దేశీయ విపణిలోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే. హిందూస్థాన్ మోటార్స్ నుండి కొత్తగా రానున్న కాంపాక్ట్ అంబాసిడర్ సెడాన్ చరిత్రను మరోసారి తిరగరాయలదని ఆశిద్దాం.

More from DriveSpark

Article Published On: Monday, February 13, 2012, 12:42 [IST]
English summary
One of the India's oldest automobile company Hindustan Motors Ltd. (HM) is planning to launch a compact Ambassador sedan car in 2012. This would be the biggest launch for 2012 from Hindustan Motors.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+