బ్రయోలో డీజిల్ వేరియంట్‌ను ప్రవేశపెట్టనున్న హోండా

హోండా సియోల్ కార్స్ ఇండియాకు ఇప్పటి వరకూ దేశీయ విపణిలో ఎలాంటి డీజిల్ కార్లు లేవు. బ్రయో డీజిల్ వేరియంట్ కోసం కంపెనీ తాజాగా అభివృద్ది చేసిన కామన్‌రైల్ ఐ-డిటెక్ డీజిల్ ఇంజన్‌ను ప్రస్తుతం పరిశీలిస్తోంది. హోండా ఫ్లాగ్‌షిప్ సెడాన్ అయిన సీటీ, ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ జాజ్‌లలో కూడా డీజిల్ వేరియంట్లను విడుదల చేయాలని హోండా సియోల్ భావిస్తోంది.
హోండా ఇటీవలే భారత మార్కెట్ కోసం రూపొందించిన ఓ 1.6 లీటర్ డీజిల్ ఇంజన్‌ను కూడా ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఇండియన్ వెర్షన్ సివిక్ ప్రీమియం సెడాన్‌లో తొలిసారిగా ఈ ఇంజన్‌ను హోండా ఉపయోగించనుంది. కాగా.. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న పెట్రోలో వేరియంట్ బ్రయో కారు 1200సీసీ (1.2 లీటర్ ఐ-విటెక్) ఇంజన్‌ను కలిగి ఉండి, 88 బిహెచ్‌పిల శక్తిని, 109 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది.
ఇది ఈ, ఎస్ మరియు వీ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. అంతేకాకుండా ఎస్ ఆప్షన్ వేరియంట్‌లో వినియోగదారుల అభిరుచుల మేరకు అధనపు ఫీచర్లు జోడించి విక్రయిస్తారు. హోండా బ్రయోలో ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానికల్లీ అడ్జస్టబుల్ రియర్ వ్యూ మిర్రర్స్, పవర్ విండోస్ వంటి అధనపు భద్రత మరియు సౌకర్యపు ఫీచర్లు లభిస్తాయి.
ఇంకా, ఇందులో యూఎస్‌బి, ఆక్స్ కనెక్టివిటీతో కూడిన 4స్పీకర్ 2డిన్ స్టీరియో సిస్టమ్ కూడా లభిస్తుంది. హోండా బ్రయో చిన్న కారు ఎనర్జిటిక్ బ్లూ, ర్యాల్లీ రెడ్, అర్బన్ టైటానియం, ఆల్బస్టర్ సిల్వర్, టాఫ్ఫెటా వైట్ మరియు క్రిస్టల్ బ్లాక్ పెరల్ అనే ఆరు ఆకర్షనీయమై రంగుల్లో లభ్యమవుతుంది.
హోండా బ్రయో 3610 మి.మీ. పొడవును, 1680 మి.మీ. వెడల్పును, 1500 మి.మీ. ఎత్తును మరియు 2345 మి.మీ. వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. హోండా బ్రయో లీటరుకు 18.4 కి.మీ. మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న 83 నగరాల్లో 135 హోండా డీలర్‌షిప్‌లలో ఈ చిన్న కారు లభ్యమవుతుందని కంపెనీ వెల్లడించింది. ఇది రెండు సంవత్సరాలు లేదా 40,000 కి.మీ. వారంటీతో లభిస్తుంది.


Click it and Unblock the Notifications








