హోండా సియాల్ జేవీ నుంచి విడిపోయిన సియోల్
ద్విచక్ర వాహన వ్యాపారంలో హీరో హోండా జాయింట్ వెంచర్ నుంచి విడిపోయి ఒంటరి ప్రయాణం సాగిస్తున్న జపాన్ ఆటో దిగ్గజం హోండా, కార్ల వ్యాపారంలో కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తోంది. హోండా ఇప్పటి వరకూ భారత మార్కెట్లోని సియోల్ గ్రూప్‌తో చేతులు కలిపి 'హోండా సియోల్ కార్స్ ఇండియా లిమిటెడ్' అనే పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే, హోండా తాజాగా ఈ జాయింట్ వెంచర్‌లో సియోల్‌కు ఉన్న పూర్తి వాటాలను సొంతం చేసుకుంది. దీంతో ఇండియాలో కార్ల వ్యాపారం పూర్తిగా హోండా చేతికి వచ్చింది. హోండా సియాల్ కార్స్ ఇండియాలో తమకున్న వాటాలను హోండా మోటార్ కంపెనీకి విక్రయించినట్టు ఉషా ఇంటర్నేషనల్ లిమిటెడ్ ప్రకటించింది. ఈ జాయింట్ వెంచర్‌లో ఉషా ఇంటర్నేషనల్ లిమిటెడ్‌కు 3.16 శాతం వాటాలు ఉన్నాయి.
కాగా.. ఈ వాటాలను ఎంత మొత్తానికి విక్రయించిన విషయాన్ని మాత్రం ఇరు కంపెనీలు వెల్లడించలేదు. ఈ వాటాల ఉపసంహరణ ఒప్పందంపై ఉషా ఇంటర్నేషనల్ సంతకాలు చేసిందని, అయితే భవిష్యత్తులో సైతం ఇరు కంపెనీలు సహాయ సహకారాలను ఇచ్చిపుచ్చుకుంటాయని హోండా సియోల్ కార్స్ ఇండియా ప్రెసిడెంట్ హిరోనోరి కనయామా వివరించారు.
గడచిన 17 సంవత్సరాలు హోండా మోటార్ కార్పోరేషన్, ఉషా ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీలు కలిసి ఇండియాలో కలిసి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. అయితే, తాజా ఒప్పందం ప్రకారం హోండాలో సియోల్ వాటాలు ఉపసంహరించుకోవడంతో, ఇక నుంచి జపాన్‌కు చెందిన హోండా మోటార్ కార్పోరేషన్ పూర్తి అనుబంధ సంస్థగా ఇది మిగిలిపోనుంది.


Click it and Unblock the Notifications








