మరోసారి సిటీ సెడాన్ ధరను రూ.10,000 పెంచిన హోండా

హోండా సియోల్ కార్స్ ఇండియా లిమిటెడ్ ఇటీవల యూనియన్ బడ్జెట్ 2012-13 విడులైన అనంతరం కంపెనీ అందిస్తున్న ఫ్లాగ్ షిప్ సెడాన్ ధరను రూ.5,000 నుండి రూ.10,500 వరకూ పెంచిన సంగతి తెలిసిందే. కాగా.. తాజాగా మరోసారి సిటీ సెడాన్ రూ.10,000 మేర పెంచుతున్నామని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ తాజా పెంపు ఏప్రిల్ 1, 2012 నుండి అమలులోకి రానుందని కంపెనీ తెలిపింది.

గత వారం హోండా సియోల్ అందిస్తున్న అన్ని ఇతర మోడళ్లను ధరలను కూడా రూ.4,000 నుండి రూ.94,000 వరకూ పెంచిన సంగతి తెలిసిందే. అయితే ఈ పెంపు పాక్షికమైనదేనని, బడ్జెట్ విడుదైలన తర్వాత తమపై ఎక్సైజ్ సుంఖాల మోత అధికంగా ఉండటంతో పూర్తి భారాన్ని వినియోగదారులపై మోపక తప్పడం లేదని హోండా సియెల్ కార్స్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) జ్ఞానేశ్వర్ సేన్ తెలిపారు.

తాజా పెంపుతో హోండా సిటీ సెడాన్‌లో వేరియంట్‌ను ధరలు రూ.8,000 నుండి రూ.10,000 వరకూ పెరుగుతాయని ఆయన తెలిపారు. గత వారం పెంపుతో హోండా సిటీ సెడాన్ ధరలు రూ.7.1 లక్షల నుండి రూ.10.33 లక్షల వరకూ (ఎక్స్‌-షోరూమ్ ఢిల్లీ) పెరిగాయి. ఈ కొత్త పెంపుతో సిటీ సెడాన్ ధరలు మరింత పెరగనున్నాయి.

యూనియన్ బడ్జెట్ 2012-13లో చిన్న కార్లపై ఎక్సైజ్ సుంఖాన్ని 10 శాతం నుండి 12 శాతానికి, పెద్ద కార్లపై ఎక్సైజ్ సుంఖాన్ని 22 శాతం నుండి 25 శాతానికి పెంచుతూ కేంద్ర సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. మార్చి 17, 2012న హోండా సియోల్ కార్స్ ఇండియా (హెచ్ఎస్‌సిఐ) కూడా వివిధ మోడళ్లపై పెంచి ధరల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

* హోండా బ్రయోపై రూ.4,000 నుండి రూ.10,000 వరకూ పెంపు.
* హోండా జాజ్‌పై రూ.15,000 వరకూ పెంపు.
* హోండా సిటీపై రూ.5,000 నుండి రూ.10,500 వరకూ పెంపు.
* హోండా సివిక్‌పై రూ.36,600 నుండి రూ.45,800 వరకూ పెంపు.
* హోండా అకార్డ్‌పై రూ.67,500నుండి రూ.93,975 వరకూ పెంపు.

More from DriveSpark

Article Published On: Thursday, March 29, 2012, 10:43 [IST]
English summary
Honda City sedan prices gone up again. Honda Siel Cars India again hiked the price of its flagship sedan City by up to Rs 10,000 from April 1. Honda already raised City price by up to Rs 10,500 following excise duty hike in Budget.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+