ఎర్టిగాకు పోటీగా ఓ ఎమ్‌పివిని అభివృద్ధి చేస్తున్న హోండా
లేట్‌గా వచ్చినప్పటికీ.. ఎర్టిగా ఎమ్‌పివి విడుదలతో లేటెస్ట్‌గా యుటిలిటీ వాహన సెగ్మెంట్లోకి ప్రవేశించిన దేశపు అగ్రగామి కార్ కంపెనీ మారుతి సుజుకి ఇండియాకు ఇక ముందు ఈ సెగ్మెంట్లో గడ్డు కాలం ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్‌పివిని టార్గెట్ చేస్తూ, జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హోండా మోటార్స్ ఓ సరికొత్త ఎమ్‌పివి అభివృద్ధి చేస్తోంది.
హోండా మోటార్స్ '2ఎన్‌హెచ్' అనే కోడ్ నేమ్‌తో డెవలప్ చేస్తున్న ఈ తొలి కాంపాక్ట్ ఎమ్‌పివి 2014 చివరి నాటికి మార్కెట్లోకి రానుంది. నెక్స్ట్-జనరేషన్ జాజ్ ఫ్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని మూడు వరుసలో ఏడు సీట్లు కలిగి ఉండేలా ఈ ఎమ్‌పివిని హోండా అభివృద్ధి చేస్తుంది. ఇప్పటికే ఇతర ఆసియా మార్కెట్లలో ప్రస్తుత హోండా జాజ్ ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా చేసుకొని రూపొందించిన 'ఫ్రీడ్' అనే ఎమ్‌పివి హోండా విక్రయిస్తోంది.
హోండా '2ఎన్‌హెచ్' కోడ్ నేమ్‌తో అభివృద్ధి చేస్తున్న ఈ నెక్స్ట్-జెన్ ఫ్రీడ్ ఎమ్‌పివి ప్రస్తుతం ఆసియన్ మార్కెట్లలో లభిస్తున్న ఫ్రీడ్ ఎమ్‌పివి కన్నా ఎన్నో రెట్లు మెరుగ్గా ఉండనుంది. ప్రస్తుత ఫ్రీడ్‌లో స్లైడింగ్ డోర్స్ ఉండగా, అప్‌గ్రేడెడ్ వెర్షన్‌లో కన్వెన్షనల్ డోర్స్ ఉండనున్నాయి. హోండా కొత్త ఎమ్‌పివి ఇండియాతో పాటుగా ఇండోనేషియా కూడా ప్రధాన మార్కెట్లు. ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లతో లభ్యం కానుంది.
పెట్రోల్ వేరియంట్ 2ఎన్‌హెచ్ ఎమ్‌పివిలో ప్రస్తుతం అప్‌గ్రేడ్ చేయబడిన హోండా సిటీలో ఉపయోగిస్తున్న 1.5 లీటర్ ఐ-విటెక్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. కాగా.. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో డీజిల్ కార్లకు డిమాండ్ అధికంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హోండా తాజాగా అభివృద్ధి చేస్తున్న సరికొత్త డీజిల్ ఇంజన్ (1.4 లీటర్ లేదా 1.6 లీటర్)ను డీజిల్ వేరియంట్ 2ఎన్‌హెచ్ ఎమ్‌పివిలో ఉపయోగించవచ్చని అంచనా.
హోండా మోటార్స్ నుండి పాపులర్ అయిన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ జాజ్ ఫ్లాట్‌ఫామ్‌పై రూపొందుతున్న ఈ సరికొత్త 2ఎన్‌హెచ్ ఎమ్‌పివి ఇటు స్పేస్ విషయంలోనూ అటు మంచి డ్రైవింగ్ డైనమిక్స్ విషయంలోనూ శభాష్ అనిపించుకోవటం ఖాయం. హోండా బ్రయో, హోండా జాజ్ ఫ్లాట్‌ఫామ్‌లపై దృష్టి సారిస్తామని హోండా గతంలో ఓ ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో, బ్రయో హ్యాచ్‌బ్యాక్ ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందుతున్న ఓ సెడాన్ కారును కూడా మనం 2013లో చూసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








